ఒక హీరో ...ఓ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడంటేనే పులుసు కారుతుంది.గెటప్స్, లుక్, యాక్టింగ్ ఇలా ప్రతీ విషయంలోనూ చాలా కష్టపడాలి. అలాంటిది త్రిపాత్రాభినయం అంటే మాటలా..అయితే అఫ్ కోర్స్ దాన వీర శూర కర్ణ ఎన్టీఆర్ గారు త్రిపాత్రాభినయం చేసారు. ఆ తర్వాత కాలంలో  మెగా స్టార్ చిరంజీవి..ముగ్గురు మొనగాళ్లు చేసినా, బాలయ్య అధినాయకుడు చేసినా,  యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్ `జై ల‌వ కుశ‌`లోనూ త్రిపాత్రాభిన‌యం చేసారు. అయితే అవి చాలా కష్టం తో కూడుకున్నవి. కథ డిమాండ్ చెయ్యకపోతే వాటి జోలికిపోరు హీరోలు. వద్దని చెప్పేస్తారు. 

ఏదో పోస్టర్ మీద వేసుకునేందుకు త్రిపాత్రాభినయం ను ఎంచుకోరు. అయితే ఇప్పుడీ టాపిక్ ఎందుకూ అంటే ఎన్టీఆర్ తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ లో ఆయన మరోసారి త్రిపాత్రాభియం చేయబోతున్నారనే వార్తరు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంత వరకూ నిజం అనేది మాత్రం చెప్పలేం. ఎందుకంటే రాజమౌళి...ఇద్దరు హీరోలు ఉన్న సినిమాలో ..ఒకరికి త్రిపాత్రాభినయం ఇచ్చేస్తే...మరో హీరో చేయటానికి ఏమీ ఉండదని తెలుసు. కాబట్టి తారక్ త్రిపాత్రాభినయం ఈ సినిమా వరకూ కష్టమే. మహా అయితే ఎన్టీఆర్ చేత మూడు గెటప్స్ వేయిస్తారు కానీ, త్రిపాత్రాభియం మాత్రం ఉండని సిని పండితులు తేలుస్తున్నారు.

 రాజమౌళి ప్రతిష్టాత్మకంగా  తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తయ్యింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటంగ్ జరుపుకున్నఈ సినిమా తాజాగా ఓ  షెడ్యూల్ ను పూర్తి చేసారు . త్వరలో తదుపరి షెడ్యూల్ కోసం పూణే కు వెళ్లనున్నారు. ఇప్పటికే పుణెలో షూటింగ్స్ కు అక్కడి ప్రభుత్వం నుండి పర్మీషన్స్ తీసుకున్నారని.. కొందరు టీమ్ సభ్యులు ఇప్పటికే అక్కడకు వెళ్లి ఏర్పాట్లలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

నెక్ట్స్ చేయబోయే షెడ్యూల్ లో హీరోలు ఎన్టీఆర్.. రామ్ చరణ్ లతో పాటు అజయ్ దేవగన్.. సముద్రఖని ఇంకా పెద్ద ఆర్టిస్ట్ లు  పాల్గొనబోతున్నట్లు సమాచారం . ఇక ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారాం రాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమరం భీం గా ఎన్టీఆర్ కనిపించనున్నారు.  చరణ్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.