రామ్ చరణ్ పుట్టిన రోజున వచ్చిన ఆర్ ఆర్ ఆర్ అప్ డేట్ గిప్ట్ తో ఇప్పుడంతా ఎన్టీఆర్ పుట్టిన రోజు వైపు దృష్టి  పెట్టారు. ఎన్టీఆర్ పుట్టిన రోజున ఖచ్చితంగా ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఓ వీడియో గిప్ట్ ని ఫ్యాన్స్ కు ఇస్తుందని దాదాపు కన్ఫర్మ్ అయ్యిపోయింది.  రామ్ చరణ్ ఈ వీడియోకు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజున ఈ వీడియో విడుదల అవుతుంది. అంతవరకూ అందరూ ఎక్సపెక్ట్ చేసేదే. అయితే ఎన్టీఆర్ అభిమానులకు అదే రోజు మరో గిప్ట్ అందనుంది. 

ఆ గిప్ట్ ఎవరి తరుపు నుంచి అంటే త్రివిక్రమ్,ఎన్టీఆర్ కాంబోలో రెడీ అవుతున్న టీమ్ నుంచి. త్రివిక్రమ్ కూడా అదే రోజున ఎన్టీఆర్ అభిమానులను ఆనందపరిచే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మేరకు ఓ సర్పైజ్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ పుట్టిన రోజు ఈ చిత్రం టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం ఏమీ లేదు.

ఇక ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పై త్రివిక్రమ్ కసరత్తు చేస్తున్నాడు. నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే దిశగా పనులు నడుస్తున్నాయి. వచ్చే ఏడాది జూన్ మొదటివారంలో ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శకనిర్మాతలు వచ్చినట్టుగా తెలుస్తోంది.

'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు చోటు వుంది. ఒక హీరోయిన్ ను బాలీవుడ్ నుంచి పరిచయం చేసే ఆలోచన చేస్తున్నారు. మరో హీరోయిన్ గా పూజ హెగ్డేను తీసుకోవాలనుకుంటున్నారు. గతంలో త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ .. పూజ హెగ్డే కాంబినేషన్లో వచ్చిన 'అరవింద సమేత' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోసారి ఈ కాంబినేషన్ హిట్ కొడుతుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.