Asianet News TeluguAsianet News Telugu

#NTR30:కొరటాల శివ కు ఎన్టీఆర్ కండీషన్? అవేమీ పెట్టుకోవద్దని స్ట్రిక్టుగానే...

ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నట్లు చెప్తున్నారు. దాంతో నాలుగైదు వెర్షన్స్ రాస్తున్నట్లు చెప్తున్నారు. ఆచార్య ఫెయిల్యూర్ తో కొరటాల ప్రతీ విషయంలోనూ ఆచి,తూచి అడుగులు వేయాల్సిన పరిస్దితి. 

Ntr Condition to Koratala for #NTR30
Author
Hyderabad, First Published Jun 28, 2022, 11:05 AM IST


ఇప్పుడు హీరోలు అందరి దృష్టీ ప్యాన్ ఇండియా సినిమాలపై ఉంది. దాందో రెగ్యులర్ స్క్రిప్టులు సరిపోవటం లేదు. చాలా మార్పులు అవసరం అవుతున్నాయి. అన్ని ప్రాంతాల వాళ్ళని తృప్తిపరిచే యూనివర్శల్ స్క్రిప్టులు అవసరం అవుతున్నాయి. ఈ ఎఫెక్ట్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాలపై కూడా పడుతోంది.  రాజమౌళి అత్యతం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భారీ మల్టీస్టారర్ మూవీ `RRR`. మెగా పవర్ స్టార్ తో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించటం తవ్రాత చిత్రాలు సైతం అదే స్దాయిలో ఉండాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కు ఈ మేరకు మార్పులు చేస్తున్నట్లు సమాచారం.

దాంతో  ఈ చిత్రం స్క్రిప్టు వర్క్ పూర్తైనా మళ్లీ రీరైట్ చేస్తున్నట్లు వినికిడి. ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నట్లు చెప్తున్నారు. దాంతో నాలుగైదు వెర్షన్స్ రాస్తున్నట్లు చెప్తున్నారు. ఆచార్య ఫెయిల్యూర్ తో కొరటాల ప్రతీ విషయంలోనూ ఆచి,తూచి అడుగులు వేయాల్సిన పరిస్దితి. ఇక ప్రొడక్షన్, బిజినెస్ విషయంలో గానీ మరే విషయంలో కానీ కొరటాల శివ ఇన్వాల్వ్ కాకూడదని కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆచార్య సమయంలో కొరటాల అన్ని దగ్గరుండి చూసుకున్నారు. అందుకే సరిగ్గా సినిమా పై కాన్సర్టేట్ చేయలేకపోయారని వినపడుతున్న నేపధ్యంలో ఈ కండీషన్ పెట్టినట్లు వినికిడి. 
 
ఇక  మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ డైలాగ్ మోషన్ పోస్టర్ ని విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ స్థాయిలో తెలుగుతో పాటు తమిళ మళయాల కన్నడ హిందీ భాషలలో పాన్ ఇండియా వైడ్ గా ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. డైలాగ్ టీజర్ ని కూడా ఐదు భాషలలో విడుదల చేసారు. యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని ఈ మూవీని నిర్మించబోతున్నారు.  
 
ఎన్టీఆర్ కూడా ఈ మూవీ కోసం సరికొత్త మేకోవర్ ని ట్రై చేస్తున్నారట. ఇందు కోసం 8 నుంచి 9 కేజీలు బరువు కూడా తగ్గుతున్నారట.  ఈ మూవీ ఆగస్టులో సెట్స్ పైకి రానున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios