మళ్లీ వారసుడే.. మరోసారి తండ్రైన ఎన్టీఆర్

First Published 14, Jun 2018, 1:48 PM IST
NTR blessed with baby boy one again
Highlights

 ఆనందంతో ట్వీట్ చేసిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తండ్రయ్యాడు. ఎన్టీఆర్ లక్ష్మి ప్రణతి దంపతులకు రెండో సంతానంగా కొడుకు పుట్టినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని తారక్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు తన ఫ్యామిలీ ఇంకాస్త పెద్దదవుతుంది మళ్లీ బాబు పుట్టాడు తన ఆనందాన్ని ట్వీట్ రూపంలో తెలియజేశాడు.

ఈ విషయం తెలియడంతో నందమూరి ఫ్యాన్స్ అంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఎన్టీఆర్, ప్రణతిలకు మొదటి సంతానంగా అభయ్ రామ్ పుట్టాడు. తారక్ కుటుంబ  సభ్యులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం తారక్ కి ఆడపుల్లి పుట్టిందనే ప్రచారం జరిగింది. కాగా.. అది అబద్ధం అని ఆయన మనేజర్ వివరించారు.

 

బాబు  పుట్టినందుకు తారక్ కుటుంబసభ్యులంతా సంతోషంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ త్రివిక్రం డైరక్షన్ లో అరవింద సమేత సినిమా చేస్తున్నాడు. దీనిలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.


 

loader