హోస్ట్ కింగ్ నాగార్జున శని, ఆదివారాలు షోని ఫుల్ ఎనర్జిటిక్ గా నడిపారు. ఓ ప్రక్క ఫన్ పంచుతూనే షాక్స్ కూడా ఇచ్చారు. డబుల్ ఎలిమేషన్ ఉందంటూ నాగార్జున చెప్పడంతో ఎలిమినేషన్ లిస్ట్ లో ఉన్న 9మంది భయపడ్డారు. శనివారం హౌస్ నుండి కరాటే కల్యాణిని ఎలిమినేట్ చేసి పంపేసిన బిగ్ బాస్, ఆదివారం పెద్ద హైడ్రామా నడిపారు. దేత్తడి హారికను బయటికి పంపిస్తున్నట్లు చెప్పి, చివరి నిమిషంలో తూచ్ అన్నారు. ఇదంతా ఎలిమినేషన్ నామినేషన్ విషయంలో మీరు సీరియస్ గా ఉంటారని రీజన్ చెప్పడం జరిగింది. 

ఇక నేడు సోమవారం కావడంతో ఎలిమినేషన్ ప్రకియ మొదలైంది. ఇంటిలోని సభ్యులు వారి అభిప్రాయం మేరకు కారణం చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాల్సింగా బిగ్ బాస్ ఆదేశించారు. కాగా కెప్టెన్ హోదాలో నోయల్ ని ఒకరిని నేరుగా ఎలిమినేషన్ కి నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. దీంతో హౌస్ లో ఉన్న లాస్యను నోయల్ నామినేట్ చేయడం జరిగింది. 

లాస్య ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్ లో వచ్చి చేరారు. గత వారం కెప్టెన్ హోదాలో ఉన్న లాస్య గత వారం నామినేషన్ నుండి తప్పించుకున్నారు. ఈ వారం మాత్రం లాస్య మాత్రం ఎలిమినేషన్ ని ఫేస్ చేయాల్సివుంది. ఇక ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంటి సభ్యుల మధ్య నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగాసాగుతుంది .