Asianet News TeluguAsianet News Telugu

మహేష్ కు రిజల్ట్ ముందే తెలిసి ట్వీట్ చేయలేదా?

ట్వీట్ చేస్తే ఆ లెక్కే వేరు. ఎంతో మంది అబిమానులను ఆ ఎక్కౌంట్ ని ఫాలో అవుతారు. ఎంతోమందికి ఆ ట్వీట్ లో కంటెంట్ రీచ్ అవుతుంది. అందుకే చాలా మంది తమ సినిమాని అలాంటి స్టార్ ఒక్క ట్వీట్ వేసి ప్రమోట్ చేసినా చాలనుకుంటారు.

No tweet from Mahesh babu for V movie
Author
Hyderabad, First Published Sep 8, 2020, 10:47 AM IST

మహేష్ వంటి సూపర్ స్టార్ ట్వీట్ చేస్తే ఆ లెక్కే వేరు. ఎంతో మంది అబిమానులను ఆ ఎక్కౌంట్ ని ఫాలో అవుతారు. ఎంతోమందికి ఆ ట్వీట్ లో కంటెంట్ రీచ్ అవుతుంది. అందుకే చాలా మంది తమ సినిమాని అలాంటి స్టార్ ఒక్క ట్వీట్ వేసి ప్రమోట్ చేసినా చాలనుకుంటారు. లేదా ఏ ఆడియో పంక్షన్ కో వస్తే ఇంకా గొప్ప అనుకుంటారు. అయితే అది ప్రతీసారీ జరగదు. తాజాగా మహేష్ తన బావ సుధీర్ బాబు తాజా చిత్రం ట్వీట్ చేయలేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగుతోంది. 

వివరాల్లోకి వెళితే...నేచుర‌ల్ స్టార్ నాని – సుధీర్‌బాబు జంట‌గా తెర‌కెక్కిన సినిమా వి.స‌స్పెన్స్ క్రైం థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో నివేద థామ‌స్‌, అదిథి రావు హైద‌రీ హీరోయిన్లుగా న‌టించారు. దిల్ రాజు నిర్మాణంగా మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా మార్చి 25నే థియేట‌ర్ల‌లోకి రావాల్సి ఉంది.అయితే క‌రోనా కార‌ణంగా సుదీర్ఘ‌కాలంగా థియేట‌ర్లు వాయిదా ప‌డ‌డంతో ఎట్ట‌కేల‌కు ఈ రోజు అమోజాన్ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌లో రిలీజ్ అయ్యింది. అయితే మొదటి షో నుంచే...సినిమాకు నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతోంది.క‌థ‌, క‌థ‌నాలు గాడి త‌ప్పాయ‌ని… నాని న‌టన బాగున్నా,  ద‌ర్శ‌కుడు మోహ‌న్‌కృష్ణ త‌న సినిమాల‌న్నింటిలోనూ ఓ వీక్ సినిమాను తెర‌కెక్కించాడ‌ని అంటున్నారు.

అవన్నీ ప్రక్కన పెడితే.. తన కెరియర్‍ని ‘వి’ మలుపు తిప్పుతుందని సుధీర్‍ బాబు చాలా ఆశలు పెట్టుకున్నాడు. సినిమా ఓటిటిలో రిలీజ్‍ అవుతుందన్నా గట్టిగా ప్రమోషన్స్ చేసాడు. అయితే ఈ చిత్రం గురించి, తన నటన గురించి తన బావ మహేష్‍ నుంచి ట్వీట్‍ పడుతుందని సుధీర్‍ ఆశించారని అంటున్నారు. అయితే ఈ సినిమా గురించి ఎందుకనో మహేష్‍ మొదటనుంచీ మౌనం పాటిస్తున్నాడు. మహేష్ బాబు... హోమ్‍ థియేటర్ లో ఫ్యామిలీస్‍తో ముందే చూసేసారని తెలుస్తోంది.ఆయన రిజల్ట్ ముందే పసిగట్టి...  ట్వీట్స్ కి దూరంగా వుంటున్నారని చెప్పుకుంటున్నారు. మరి ఈ వార్తలో నిజమెంతో మహేష్ కే తెలుసు.

Follow Us:
Download App:
  • android
  • ios