ఏదన్నా ఓ సినిమా మొదలు అవుతోందంటే అక్కడ నుంచే ఆ ప్రాజెక్టు సంభందించి రూమర్స్ ప్రారంభమైపోతాయి. అందులోనూ స్టార్స్ ఆ ప్రాజెక్టులో భాగం అవబోతారు అని తెలిస్తే మరీను. గత నాలుగు రోజులుగా మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. బాలయ్య ఓ రీమేక్ లో చేయబోతున్నారని, అందులో ఎన్టీఆర్ కూడా నటిస్తారనీను. వీళ్లిద్దరు కలిసి నటిస్తే వచ్చే క్రేజ్ ఓ రేంజిలో ఉంటుంది కానీ, ఆ సిట్యువేషన్ నిజంగానే వస్తుందా...నందమూరి అభిమానులు ఆశపడుతున్నారు కానీ నిజమౌతుందా...ఇప్పటికే రామ్ చరణ్ , చిరంజీవి..కలిసి ఆచార్యలో నటిస్తున్నారు. అదే విధంగా ఈ బాబాయ్..అబ్బాయి లు నటిస్తే బాగుంటుంది. దాంతో ఇదే ఆలోచనలతో వార్తలు రాసేసింది మీడియా. అయితే అవన్నీ పుకార్లే అని తేలింది. ఇంతకీ అదేం సినిమా అంటారా...మళయాళ రీమేక్.

స‌చీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` మ‌ల‌యాళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇందులో పృథ్వీరాజ్‌, బీజు మీన‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ హీరోగా న‌టించాడు. ఈ చిత్ర రీమేక్ రైట్స్‌ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్య‌దేవ‌ర‌నాగ‌వంశీ ద‌క్కించుకున్నార‌ు. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారు. 

వారిలో  ఒక హీరో పాత్రకు నందమూరి బాలకృష్ణని అనుకుంటున్నట్టు మొదలయ్యాయి.అక్కడితో ఆగకుండా ఎన్టీఆర్ ని కూడా ముడెట్టేసారు. అయితే ప్రస్తుతానికి ఈ సినిమాకు డైరెక్టర్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నామంటోంది టీమ్. అసలు హీరోలు దాకా ఇంకా రాలేదని చెప్తున్నారు. ఒకసారి డైరక్టర్, టెక్నీషన్స్ ఫైనల్ అయ్యాకా  ఏ హీరోలని సంప్రదిస్తారని చెప్తున్నారు అయితే ఈ ప్రాజెక్టుని బి.గోపాల్ చేతిలో పెడితే ఎలా ఉంటుందని నిర్మాతలు ఆలోచిస్తున్నారట.  అయితే అందులోనూ నిజం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది.
 
మరో ప్రక్క ..సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఇటీవలే నితిన్ నటించిన భీష్మ తో పెద్ద హిట్ అందుకుంది. అంతేకాకుండా వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.  ప్ర‌స్తుతం నితిన్ ,కీర్తి సురేష్‌ల‌తో రంగ్‌దే, నానితో శ్యామ్ సింగ‌రాయ్‌. నాగ‌శౌర్య‌తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రంగ్‌దే జులై 30న, శ్యామ్ సింగ‌రాయ్‌ డిసెంబర్ 25న (క్రిస్మస్ సందర్భంగా) విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.