అందంతో పాటు అభినయంతోనూ  ఆకట్టుకోగల నటి నివేథా థామస్.. మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో ఇప్పుడు ఈమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. నాని హీరోగా నటించిన జెంటిల్ మేన్ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది ఈ భామ.. ఆ తర్వాత జై లవకుశ, నిన్ను కోరి, 118 చిత్రాలు మంచి సక్సెస్ ని అందుకొని ఆమెకి మంచి విజయాన్ని అందించాయి. తాజాగా నాని, సుదీర్ బాబు హీరోలుగా 'v' అనే చిత్రంలోనూ కనిపించింది. 

ఇందులో అదితిరావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటించారు. సినిమా ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది. మిగతా వాళ్ల సంగతి ఎలా ఉన్నా... నివేథా ధామస్ పై సోషల్ మీడియాలో ఓ రేంజిలో ట్రోలింగ్ మొదలైంది. అందుకు కారణం ఆమె రిలీజ్ కు ముందు చెప్పిన మాటలే కావటం విశేషం. రిలీజ్ కు ముందు మీడియాకిచ్చిన ఇంటర్వ్యూల్లో తన పాత్ర గురించి ఓ రేంజ్ లో చెప్పుకొచ్చింది. చాలా గొప్ప పాత్ర అని, తన కెరీర్ లో బెస్ట్ అని,  ఉదాత్తమైన పాత్ర అని చెప్పుకొచ్చింది. తీరా సినిమాలో చూస్తే అసలు ప్రాధాన్యత లేని పాత్ర.

'v' మూవీలో అపూర్వ అనే నవలా రచయిత పాత్ర పోషించింది నివేత. కథ ప్రకారం ఒకట్రెండు చోట్ల పోలీస్ అధికారి సుధీర్ బాబుకు సహాయం చేస్తుంది. అయితే ఆ పాత్రే కథకు అడ్డుపడుతుంది. ఆ సీన్స్ లేకపోతే బాగుండును అనిపించింది. అసలు మొత్తంగా ఆమె రోల్‌ని తీసేస్తే నష్టమే లేదు. ఇంకా లెంగ్త్ తగ్గి బెటర్ అవుతుందని కొందరు తమ అభిప్రాయం వెల్లిబుచ్చారంటనే అర్దమవుతుంది. ఇంకా చెప్పాలంటే... నివేద  పాత్ర కంటే నిడివి పరంగా చిన్నదే అయినప్పటికీ అదితి పాత్ర బెటర్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి మొదటిసారిగా తన పాత్రల ఎంపికపై నివేథా థామస్ విమర్శలు ఎదుర్కొంటోంది.