Asianet News TeluguAsianet News Telugu

పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్ నిరాకరించిన నివేదా.. కారణమేంటంటే..

  • నాని సరసన జెంటిల్ మన్, నిన్ను కోరి చిత్రాలతో నివేదాకు క్రేజ్
  • నివేదా థామస్ కు గతంలో పవన్ కల్యాణ్ సినిమాలో అవకాశం
  • పవర్ స్టార్ సినిమాలో ఆఫర్ తిరస్కరించిన నివేదా.. ఎందుకో చెప్పింది
niveda thamos explanation to why she rejected pawan kalyan offer

నానితో జెంటిల్ మన్ సినిమాలో మంచి పేరు తెచ్చుకున్న నివేదా థామ‌స్‌.. తాజాగా నిన్ను కోరి సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. ఈ కేర‌ళ కుట్టి కాస్తంత పొట్టిగా,  బొద్దుగా అనిపించినా ఆమె ఎక్స్ ప్రెష‌న్స్ ను పాజిటివ్ గా మలుచుకుని తెలుగు ప్రేక్షకుల్లో మాంచి మార్కులు కొట్టేసింది.

 

ఎలాంటి హావ‌భావాలైనా  ప‌లికించే స‌త్తా ఉన్న ఈ అమ్మ‌డు తాజాగా నిన్ను కోరి చిత్రంతో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. తొలిచిత్రం నాని జెంటిల్ మెన్ మూవీలో గుర్తింపు పొందిన ఆమెకు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ మూవీలో చేసే ఛాన్స్ వ‌చ్చింది. అయితే.. ఆ ఛాన్స్‌కు నో చెప్పేయ‌టం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.
 

ప‌వ‌న్ సినిమాలో అవ‌కాశాన్ని ఎందుకు వ‌దులుకున్నారంటూ ఈ బొద్దుగుమ్మ‌ను అడిగిన‌ప్పుడు ఆమె చాలానే విష‌యాల్ని చెప్పింది. ప‌వ‌న్ సినిమాలో న‌టించే అవ‌కాశం రావ‌టం ఏ న‌టికైనా అదృష్ట‌మేన‌ని.. నాలాంటి వారికి ఆ అదృష్టం చాలా త‌క్కువ కాలంలోనే ల‌భించింద‌ని హ్యాపీగా ఫీల‌య్యాన‌ని చెప్పింది. కానీ.. అలాంటి రేర్ ఛాన్స్‌ను వ‌దులుకోవ‌టానికి స‌రైన కార‌ణ‌మే ఉంద‌ని చెబుతోంది.
 

ప‌వ‌న్ మూవీకి నో చెప్ప‌టానికి తాను చాలానే బాధ ప‌డ్డాన‌ని చెప్పిన నివేదితా.. ఎందుకు రిజెక్ట్ చేశాన‌న్న‌ది చెబుతూ.. ఆ చిత్రంలో ప‌వ‌న్ చెల్లెలు పాత్ర‌ను ఆఫ‌ర్ చేశార‌ని.. అందుకే నో చెప్పిన‌ట్లుగా వెల్ల‌డించింది. హీరోయిన్ గా చేసి చెల్లెలు పాత్ర‌లో చేస్తే మ‌రిన్ని అవ‌కాశాలు మిస్ అవుతాయ‌న్న ఉద్దేశంతోనే తాను రిజెక్ట్ చేశానే త‌ప్పించి మ‌రోకార‌ణం లేద‌ని ఆమె పేర్కొంది.

 

హీరోయిన్ గా మంచి పేరు వ‌స్తున్న వేళ‌లో ఎంత ప‌వ‌న్ మూవీ అయితే మాత్రం చెల్లెలు పాత్ర‌లో క‌నిపిస్తే.. కెరీర్‌కు క‌ష్ట‌మే క‌దా? ప‌వ‌న్ మూవీకి నో చెప్ప‌టంలో నివేదిత త‌ప్పు లేద‌నే చెప్ప‌ాలి.

Follow Us:
Download App:
  • android
  • ios