నిత్యా మీనన్ 'నిన్నిలా నిన్నిలా' రివ్యూ
నిత్యామీనన్ సినిమాలంటే అన్నీ 'అలా మొదలైంది' లా అవ్వక పోవచ్చు..కానీ అవతాయేమో అని ఆశ అయితే ఉంటుంది. అందులోనూ ఓ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ అని పబ్లిసిటీ చేసాక ఆ ఆశ విశ్వరూపం దాలుస్తుంది. దానికి తోడు ఎన్నో సూపర్ హిట్స్ అందించిన నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేసిన సినిమా. ఇవన్నీ కాక..లండన్ లోని ఓ ఫుడ్ కోర్ట్ కిచెన్ నేపధ్యం ...ఈ వంట గదిలో ఏ లవ్ స్టోరీ ఉడికిందో చూడాలనిపిస్తుంది. పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ కూడా నేనూ ఉన్నా అని పిలుస్తున్నప్పుడు ఆ కిచెన్ లోకి వెళ్లకుండా ఎలా ఉండగలం..వాళ్ల వండిన డిష్ ఏమిటో ...ఎలా ఉందో...చూద్దాం. ఇంతకీ ఈ సినిమా డైరక్టర్ మరెవరో కాదు..మళయాళంలో ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన దివంగత దర్శకుడు ఐ.వి. శశి కుమారుడు...శశి (అతను పేరూ అదే). అతని తొలి సినిమా ఇది.
నిత్యామీనన్ సినిమాలంటే అన్నీ 'అలా మొదలైంది' లా అవ్వక పోవచ్చు..కానీ అవుతాయేమో అని ఆశ అయితే ఉంటుంది. అందులోనూ ఓ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ అని పబ్లిసిటీ చేసాక ఆ ఆశ విశ్వరూపం దాలుస్తుంది. దానికి తోడు ఎన్నో సూపర్ హిట్స్ అందించిన నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేసిన సినిమా. ఇవన్నీ కాక..లండన్ లోని ఓ ఫుడ్ కోర్ట్ కిచెన్ నేపధ్యం ...ఈ వంట గదిలో ఏ లవ్ స్టోరీ ఉడికిందో చూడాలనిపిస్తుంది. పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ కూడా నేనూ ఉన్నా అని పిలుస్తున్నప్పుడు ఆ కిచెన్ లోకి వెళ్లకుండా ఎలా ఉండగలం..వాళ్ల వండిన డిష్ ఏమిటో ...ఎలా ఉందో...చూద్దాం. ఇంతకీ ఈ సినిమా డైరక్టర్ మరెవరో కాదు..మళయాళంలో ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన దివంగత దర్శకుడు ఐ.వి. శశి కుమారుడు...శశి (అతను పేరూ అదే). అతని తొలి సినిమా ఇది.
కథ
దేవ్ (అశోక్ సెల్వన్)కు కాస్తంత ఎక్కువ బరువు, దానికి తోడు muscle spasms అనే నరాల బలహీనత, ఇవన్నీచాలదన్నట్లు రాత్రిళ్లు నిద్ర పట్టనివ్వని ఇన్సోమ్నియా. చిన్న వయస్సులోనే ఇన్ని సమస్యలు ఉన్న ఇతన్ని చూసి కొలీగ్స్ జాలి పడుతూంటారు. ఇంతకి ఇతను ఎవరూ అంటే ..ఓ చెఫ్. హైదరాబాద్ నుండి లండన్ వెళ్లి అక్కడ చాలా పాపులర్ అయిన అమరా అనే పేరు గల రెస్టారెంట్ లో జాయిన్ అవుతాడు. అతను అక్కడ చేరటానికి కొద్ది కాలం ముందే తార(రీతూ వర్మ) చెఫ్ గా చేస్తూంటుంది. ఆమెకు ఓసీడి సమస్య. అదే మహానుభావుడులో శర్వానంద్ కు ఉందే అతి పరిశుభ్రత టైప్ సమస్య. ఆ హోటల్ ని నడిపే నాసర్ ది మరో సమస్య. ఇలా ఎవరి సమస్యల్లో వాళ్లు జీవిస్తూ..ఆ హోటల్ లో ఆహార పదార్దాలు తయారు చేస్తూంటారు. ఈ క్రమంలో తార,దేవ్ మెల్లిమెల్లిగా దగ్గరవుతారు.
అయితే దేవ్ ఎప్పుడూ ఏదో లోకంలో ఉన్నట్లు ఉండటం తార గమనిస్తుంది. అయితే అడిగే సాహసం చేయదు. కానీ ఓ రోజు రాత్రి అనుకోకుండా డోర్స్ క్లోజ్ అయ్యి..వీళ్లిద్దరూ ఆ రెస్టారెంట్ లో ఇరుక్కుపోతారు. అప్పుడు వీళ్లిద్దరు ఒకరి మనస్సులు మరొకరు విప్పుకుంటారు. ప్లాష్ బ్యాక్ లు పంచుకుంటారు. ఆ ప్లాష్ బ్యాక్ లో నిత్యామీనన్ ఎంట్రి ఇస్తుంది. ఆమే హీరోకు ఉన్న సమస్యలకు కారణం అని తారకు అర్దమవుతుంది. అలాగే తారకు ఉన్న సమస్య , పరిష్కారం దేవ్ కు అర్దమవుతుంది. ఒకరి సమస్యలను ఒకరు ఎలా పరిష్కరించుకున్నారు. అసలు నిత్యామీనన్ ఎవరు..ఆమెతో దేవ్ కు ఉన్న రిలేషన్ ఏమిటి...చివరకు ఈ కథ ఎలాంటి ముగింపు తీసుకుంటుంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే...
ఇదో ఫుడ్ ఫుటేజ్ చిత్రం. డైరక్టర్ తీసుకున్న నేపధ్యం..పాత్రలు,వాటి కాంప్లిక్ట్ లు బాగున్నాయి. అయితే కొద్దిగా ఓపిగ్గా చూడగలగాలి. అలాగే ఇదో ఫీల్ గుడ్ సినిమా అని గుర్తిస్తేనే ఎంజాయ్ చేయగలుగుతారు. మెల్లిగా ...ఓ కలలో జరుగుతున్నట్లుగా సినిమా సాగుతుంది. మంచి కెమెరా వర్క్,మంచి మ్యూజిక్,లీడ్ స్టార్స్ చక్కటి ఫెరఫార్మెన్స్, మరీ ముఖ్యంగా నిత్యామీనన్ నటన కళ్ల ముందు కొన్ని విజువల్స్ ని పరుస్తాయి. కథగా ఏమీ జరిగినట్లు ఉండదు.. కానీ మెల్లిగా సినిమా జరుగుతూంటుంది. ఫుడ్ మీద ప్రేమ..మెల్లిమెల్లిగా మనుష్యుల మద్య ప్రేమగా ఆవిష్కారమవుతుంది. ప్లాష్ బ్యాక్ ఓపెన్ అయ్యేదాకా నిత్యామీనన్ గురించి చిన్న క్లూ కూడా ఉండదు. ఆమె ఎంటరయ్యాక..ఆమె హీరోని, మనని విడిచిపెట్టదు. డైలాగులు కూడా ఆహారం గురించే ఉన్నట్లు ఉంటాయి. కానీ అవి కథలో ఎమోషన్స్ ని, క్యారక్టర్స్ డిటేలింగ్ ని ఇస్తూ..రిలేషన్స్ ని బిల్డ్ చేస్తూంటాయి. లండన్ కిచెన్ రూమ్ నుంచి ఓల్డ్ సిటీ ఇరానీ ఛాయ్ దాకా కథ ప్రయాణం సాగుతుంది. స్క్రీన్ ప్లే నీటుగా ఉంది. ఎక్కువా తక్కువా లేదు. అంతా డైరక్టర్ పాయింటాఫ్ కావటంతో ఎవరూ హీరో కాదు..హీరోయిన్ కాదు..అందరూ ప్రధాన పాత్రలే. డైరక్టరే హీరో.
నటీనటులు విషయానికి వస్తే ...తమిళ నటుడు అశోక్ సెల్వన్ ...చాలా సార్లు మనకు నటుడు మాధవన్ ని గుర్తు చేస్తారు. మంచి నటుడు అని ,ఈ పాత్రకు ఫెరఫెక్ట్ ఛాయిస్. నిత్యామీనన్ గురించి చెప్పేదేముంది. రీతూవర్మ ..అదే పెళ్లి చూపులు అమ్మాయి చిత్రంగా ఈ సినిమాలోనూ ఫుడ్ తోనే కనెక్షన్. నాజర్ కు ఇలాంటి పాత్రకు కొట్టిన పిండి. ఈ సారి మరింతి పిండి చేసాడు.
టెక్నికల్ గా ఈ సినిమా మంచి స్టాండర్డ్స్ లోనే ఉంది. ఇది స్లో పేస్ లో నడిచే సినిమా. డైరక్టర్ ..కథలో లవ్ ఫీల్ రావాలంటే అదే మార్గమనుకున్నట్లున్నారు. కొన్ని సార్లు అది నిజమే అనిపిస్తుంది. అయితే కొన్ని సార్లు మరీ ఓవర్ గా ఉంది కదా అనిపించకమానదు.
ఫైనల్ థాట్
అన్ని సినిమాలను ఒకే గాటన కట్టేయలేము..ఇలాంటి సినిమాలు స్పెషల్ గానే చూడాలి,థియోటర్ రిలీజ్ పెట్టకుండా మంచి పని చేసారు.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.5
ఎవరెవరు..
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, జీ స్టూడియోస్
నటీనటులు: అశోక్ సెల్వన్, నిత్యామీనన్, రీతూవర్మ, నాజర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి
సంగీతం: రాజేశ్ మురుగేశన్
పాటలు: శ్రీమణి
డైలాగ్స్: నాగ చంద, అనుష, జయంత్ పానుగంటి
ఆర్ట్: శ్రీ నాగేంద్ర తంగాల
ఎడిటింగ్: నవీన్ నూలి
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అని.ఐ.వి.శశి
నిర్మాత: బీవీఎస్ఎన్.ప్రసాద్
సమర్పణ: బాపినీడు.బి
ఓటీటి:జీ ప్లెక్స్
విడుదల తేదీ : ఫిబ్రవరి 26, 2021