నితిన్ ‘రంగ్ దే’ రివ్యూ
ఇష్క్ నుంచి నితిన్ ప్రేమ కథల్లో బాగానే రాణిస్తున్నాడు. ఎక్కువ ఫన్, కొద్ది సెంటిమెంట్, మంచి పాటలు ఉంటే నితిన్ సినిమా పాసైపోతుంది. ఇంకాస్త మోతాదుపెరిగితే అది భీష్మ అవుతుంది. అప్పుడప్పుడూ తను కొత్త కథలు చేయాలి అని,పాతకు చెక్ చెప్దామనుకుంటే అవి కెరీర్ కే చెక్ చెప్పేస్తాయనిపించే స్దాయిలో రిజల్ట్ ఇస్తున్నాయి. ఈ నేపధ్యంలో తనకు బాగా అలవాటైన, అచ్చొచ్చిన రొమాంటిక్ కామెడీతో, యూత్ ప్రేమ కథలను తీస్తున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా చేసాడు. మరి నితిన్ కు ఈ సినిమా ఏ స్దాయి ఫలితాన్ని ఇచ్చింది. అసలు ఈ ‘రంగ్ దే’ కథేంటి...కీర్తి సురేష్ పాత్ర ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
ఇష్క్ నుంచి నితిన్ ప్రేమ కథల్లో బాగానే రాణిస్తున్నాడు. ఎక్కువ ఫన్, కొద్ది సెంటిమెంట్, మంచి పాటలు ఉంటే నితిన్ సినిమా పాసైపోతుంది. ఇంకాస్త మోతాదుపెరిగితే అది భీష్మ అవుతుంది. అప్పుడప్పుడూ తను కొత్త కథలు చేయాలి అని,పాతకు చెక్ చెప్దామనుకుంటే అవి కెరీర్ కే చెక్ చెప్పేస్తాయనిపించే స్దాయిలో రిజల్ట్ ఇస్తున్నాయి. ఈ నేపధ్యంలో తనకు బాగా అలవాటైన, అచ్చొచ్చిన రొమాంటిక్ కామెడీతో, యూత్ ప్రేమ కథలను తీస్తున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా చేసాడు. మరి నితిన్ కు ఈ సినిమా ఏ స్దాయి ఫలితాన్ని ఇచ్చింది. అసలు ఈ ‘రంగ్ దే’ కథేంటి...కీర్తి సురేష్ పాత్ర ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి
ప్రక్క ప్రక్క ఇళ్లల్లో పెరిగుతారు అర్జున్ (నితిన్), అను (కీర్తి సురేష్). అను మొదటి నుంచి చదువులో ముందుంటుంది. అర్జున్ అంతంత మాత్రం. దాంతో అనుని చూసి నేర్చుకోమని అర్జున్ ని అతని తండ్రి (నరేష్) ప్రతీసారి సతాయిస్తూంటాడు. దాంతో ఆమెపై చాలా కోపం వచ్చేస్తూంటుంది. ప్రతీదానికి తన ఇంట్లో అనుకే ప్రయారిటీ అతను జీర్ణించుకోలేక...ద్వేషం పెంచుకుంటాడు. అక్కడ నుంచి అనుని దొరికిన ప్రతీ చోటా ఇరికిస్తూంటాడు. అలా ఓ సారి ఇరికిస్తే అది ఆమె పెళ్లి కి లీడ్ తీస్తుంది. కానీ అనుకి..మనస్సులో అర్జున్ అంటే అమితమైన ప్రేమ. దాంతో అను పెళ్లిపీటలమీద నుంచి వచ్చేసి అర్జున్ నే చేసుకుంటానంటుంది. తప్పనిసరి పరిస్దితుల్లో ఆమెని పెళ్లిచేసుకుంటాడు. ఇద్దరూ పై చదువు కోసం దుబాయ్ వెళ్తారు. తన ప్రమేయం లేకుండా తను ద్వేషించే అమ్మాయితో పెళ్లి కావటంతో అర్జున్ ఆమె పట్ల ప్రేమను పెంచుకోలేకపోతాడు. కానీ ఓ బలహీన క్షణంలో ఆమెతో శారీరకంగా కలుస్తాడు. అయినా సరే అతనిలో మార్పు రాదు..విడాకుల ఇవ్వమని, అబార్షన్ చేయించుకోమని ఆమెను కోరుతాడు. అలాంటి పరిస్దితుల్లో అను ఏం చేసింది. చివరకు అర్జున్ మనస్తత్వాల్లో మార్పు ఎలా వచ్చింది? చివరకు ఏం జరిగింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్...
సాధారణంగా రొమాంటిక్ కామెడీల్లో హీరో,హీరోయిన్స్ ఇద్దరూ మొదట్లో కొట్టుకుని ,చివరకు ఒకరితో మరొకరు ప్రేమలో పడుతారు. చివరకు ఒకరినొకరు విడవలేని స్దితికి వచ్చేస్తారు. ఇదే ఫార్మెట్లోచాలా సినిమాలు వచ్చాయి.వస్తూంటాయి. ఇది సక్సెస్ ఫుల్ ఫార్ములానే. అయితే ఈ ఫార్ములాతో ఉన్న సమస్య ఏమిటంటే..క్లైమాక్స్ ఏమిటో..తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఈజీగా గెస్ చేయగలుగుతాడు. దాంతో రొటీన్ అనిపించుకోకుండా ఇంట్రస్టింగ్ గా సీన్స్ తెరపై నడపై పెద్ద టాస్క్. ఈ రిస్క్ ని ఈ సినిమా కూడా ఫేస్ చేసింది. చాలా భాగం సామాన్యుడు సైతం గెస్ చేస్తాడు. అయితే , ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు,ఫన్ తో నడిచినప్పుడు బాగానే అనిపిస్తుంది. మిగతా చోట్ల సినిమా బాగా బోర్ కొట్టేస్తుంది. దానికి తగినట్లు దర్శకుడు ఈ సినిమా అన్ని వర్గాలు వారు , అన్ని వయస్సులు వారు చూడాలనే ఆశయంతో ...ఫస్టాఫ్ యూత్ కోసం, సెకండాఫ్ ఫ్యామిలీల కోసం అంటూ…విడకొట్టుకున్నాడు. దాంతో ఈ సినిమా అనని వర్గాల మాట దేవుడెరుగు కానీ అసలు ఏ వర్గానికి సంభందించిన సినిమానే తేలకుండా పోయింది. సెకండాఫ్ ..ఫ్యామిలీస్ కు అంకితం చేసాడు కాబట్టి...మనం ఈ సినిమా ఫ్యామిలీస్ చూస్తారని లెక్కేయాలి. నిజంగా ఫ్యామిలీస్ బయిలుదేరితే బాగానే వర్కవుట్ అవుతుంది మరి. అయితే స్లో నేరేషన్, సీన్స్ సాగదీసినట్టు ఉండడం కాస్త జనాల సహనాన్ని పరీక్షించింది. దానికి తోడు సినిమాకి కీలకంగా నిలవాల్సిన హీరో – హీరోయిన్ ఎమోషనల్ ఎపిసోడ్స్ ఏవో ఉండాలి కాబట్టి...ఉన్నాయి కానీ కన్విన్సింగ్ గా అనిపించలేదు.పరుగెట్టుకుంటూ వెళ్లి సినిమా చూసేయాలి అనేంతగా కనెక్ట్ అవ్వలేదు. ఓటీటిలో వచ్చేదాకా ఆగుదాం అని ఆలోచన వచ్చేలా ఉన్నాయి.
టెక్నికల్ గా...
ఈ సినిమాకు హైలెట్ గా నిలవాల్సిన మ్యాజిక్ మేజిక్ జరగలేదు. దేవిశ్రీ ఎందుకునో ఈ సినిమాకు హిట్ సాంగ్స్ ఇవ్వలేదు. ఉన్నంతలో `ఏమిటో ఇది..` బాగుంది. ఇక పిసీ శ్రీరామ్ కెమెరా వర్క్ గొప్పగా ఉంది కానీ ఈ సినిమాలో వచ్చే సీన్స్ కు అవసరమా అనిపించింది. ఎందుకంటే చాలా సీన్స్ గదుల్లోనే జరిగిపోతాయి. విజువల్ బ్యూటీకి అవకాసం లేదు. రైటింగ్ సైడ్ బాగా లేజీగా ఉంది. డైరక్టర్ గా అద్బుతం కాదు కానీ చల్తా హై. డైలాగ్స్ లో కొన్ని వన్ లైనర్స్ మరియు కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ బాగున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
నటీనటుల్లో నితిన్ కు ఇది ఎన్నో సినిమాల్లో చేసిన పాత్రే. రీసెంట్ గా భీష్మలోనూ చేసాడు. కొత్తేం కాదు. కాబట్టి కేక్ వాకే. ఇంక కీర్తిసురేష్ ఎందుకనో ఎట్రాక్టివ్ గా మాత్రం లేదు. ఇద్దరి పెయిర్ మాత్రం బాగుంది. రెగ్యులర్ కమిడియన్స్ కమ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ లు అయిన నరేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ..తమకు ఇచ్చిన పాత్రలను ఎప్పటిలాగే పోషించారు.
ఫైనల్ థాట్
పాత కథలకు కొత్త రంగులేసినా..పాతగానే కనపడతాయి..ఎగ్జైట్మెంట్ ఏమీ ఉండదు. ఎంటర్టన్మెంట్ రాలదు.
--సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2
ఎవరెవరు...
బ్యానర్: సితారా ఎంటర్‌టైన్‌మెంట్
నటీనటులు: నితిన్, కీర్తీ సురేష్, నరేష్, కౌసల్య, రోహిణి, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, వినీత్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురాం తదితరులు.
మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫి: పీసీ శ్రీరాం
ఎడిటింగ్: నవీన్ నూలీ
రచన: వెంకీ అట్లూరి, పీ సతీష్ చంద్ర
దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
రిలీజ్ డేట్: 2021-03-26