Asianet News TeluguAsianet News Telugu

‘మ్యాస్ట్రో’ ఓటీటి రిలీజ్ డేట్


నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. నభా నటేశ్‌, తమన్నా హీరోయిన్స్. బాలీవుడ్‌లో విజయవంతమైన ‘అంధాధున్‌’కు రీమేక్‌గా ‘మ్యాస్ట్రో’ తెరకెక్కించారు. 

Nithiins Maestro OTT Release Date Locked? jsp
Author
Hyderabad, First Published Jul 19, 2021, 4:31 PM IST

కరోనా విపత్కర పరిస్థితుల నుంచి తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంగతి తెలిసిందే. దాంతో సినీ పరిశ్రమలో షూటింగ్‌లు మొదలవుతున్నాయి. అయినా సరే ప్రస్తుతం థియేటర్లు, మల్టీపెక్స్‌లు తెరిచే పరిస్థితి మాత్రం కనపడటం లేదు. ప్రభుత్వాలు తెరుచుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నా ఎవరకీ ధైర్యం చాలటం లేదు. ఒకవేళ థియేటర్లు తెరిచినా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులు రావటం కష్టమే అని అందరూ భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న పలు సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి.  ఈ క్రమంలో వెంకటేష్ హీరోగా చేసిన నారప్ప రిలీజ్ అవుతోంది. అలాగే  నితిన్‌ ‘మ్యాస్ట్రో’ కూడా ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది.

నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. నభా నటేశ్‌, తమన్నా హీరోయిన్స్. బాలీవుడ్‌లో విజయవంతమైన ‘అంధాధున్‌’కు రీమేక్‌గా ‘మ్యాస్ట్రో’ తెరకెక్కించారు. ఇటీవల షూటింగ్  పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ ఓటీటీ సంస్ద డిస్నీ+హాట్ స్టార్ చిత్ర టీమ్ ని  సంప్రదించి రిలీజ్ కు ఓకే చేసుకుంది. అలాగే ఆగస్టు 15 న రిలీజ్ చేయాలనిఅయితే నిర్ణయించుకున్నట్లు సమాచారం, దీనిపై చిత్ర టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. మరి ‘మాస్ట్రో’ ఆ రోజున ఓటీటీలో వస్తాడో? లేడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!

శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాను సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. మహతి స్వర సాగర్‌ స్వరాలు సమకూర్చారు.విభిన్నమైన క్రైమ్‌ కామెడీ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమాలో నితిన్‌ అంధుడైన పియానో ప్లేయర్‌గా కనిపించనుండగా.. తమన్నా విలన్ ఛాయలున్న పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్‌, ఛాయాగ్రహణం: జె.యువరాజ్‌.
 

Follow Us:
Download App:
  • android
  • ios