కరోనా పరిస్థితుల్లో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌కి డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. అన్ లాక్ ని ప్రభుత్వం చేసినా థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునే పరిస్థితి కనపడటం లేదు. దాంతో ఇప్పటికే అనేక చిత్రాలు ఆన్‌లైన్‌లో విడుదల అయ్యాయి. మరికొన్ని విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అయితే ఇలా తమ సినిమాలు ఓటీటిలలో రిలీజ్ అవటం హీరోలకు ఇష్టం లేదు. ఏ మాత్రం హడావిడి,హంగామా లేకుండా రిలీజ్ అవటం వారిని బాధిస్తోంది. కానీ నిర్మాత నిర్ణయాలని కాదనలేని సిట్యువేషన్. ఇలాంటి క్రమంలో నితిన్‌ నటిస్తోన్న రంగ్‌దేకు కూడా ఓ ఓటీటీ ఫ్లాట్‌ఫాం నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

 ప్రొడక్షన్‌ కాస్ట్‌కి 20శాతం కలిపి ఆ ఓటీటీ ‘రంగ్‌దే’కి ఆఫర్‌ చేసినట్లు సమాచారం. ఆ ఓటిటి మరేదో కాదు జీ5 అని తెలుస్తోంది. అయితే దీనిపై నితిన్ మాత్రం ఇంకా స్పందించనున్నట్లు టాక్.  కానీ జీ5 వాళ్లు స్వయంగా ఇలా ఆఫర్ తో ముందుకు రావటం నితిన్ ని ఇబ్బందుల్లోకి తోసిందని, ఇంకా మూడు నెలలు ఆగుదామని నితిన్ చెప్తున్నా నిర్మాతలు ఆగుతారా అనేది ప్రశ్నార్దకం అని అంటున్నారు. ఓటీటి వారు స్పీడు కాకపోతే తన సినిమాకు అక్కడే రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అని నితిన్ భావిస్తున్నారట.

ఇక రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కిన ఈ మూవీలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటించింది. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.   దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. అయితే, దేవి శ్రీ ప్రసాద్ అందించే పాటలు ఈ సినిమాకి ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తుంది. పీసీ శ్రీరామ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో నితిన్ మరియు కీర్తి ఇద్దరు ఎంత పోటీగా నటిస్తున్నారని సమాచారం.