నితిన్ హీరోగా అట్లూరి వెంకీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రంగ్ దే’.  ఈ రొమాంటిక్ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చాలా వేగవంతంగా జరిగి,కరోనా దెబ్బతో బ్రేక్ పడింది. అయితే ఈ సినిమా గురించిన ఓ వార్త హఠాత్తుగా మీడియాలో ప్రత్యక్ష్యమైంది. ఈ సినిమా ఓ మళయాళ చిత్రం ఫ్రీ మేక్ అని చెప్తున్నారు. మళయాళ ఒరిజనల్ చిత్రం కాన్సెప్టుకు కొద్దిగా చేర్పులు, మార్పుల చేసి, తెలుగు నేటివిటికి తగినట్లుగా మార్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే..ఛార్లీ. 

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. అయితే, దేవి శ్రీ ప్రసాద్ అందించే పాటలు ఈ సినిమాకి ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తుంది. పీసీ శ్రీరామ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో నితిన్ మరియు కీర్తి ఇద్దరు ఎంత పోటీగా నటిస్తున్నారని సమాచారం. 

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మళయాళ చిత్రంలో.. హీరో, హీరోయిన్లు గాడంగా ప్రేమించుకుంటారు. కానీ తమ జీవితాన్ని ఫ్రీగా గడపాలనుకున్న ఆ ఇద్దరు చివర్లో ప్రేమను త్యాగం చేయటం హైలెట్ గా ఉంటుంది. పెళ్లి అయితే తమ స్వేచ్చకు భంగమని ఇద్దరూ భావిస్తారు. అయితే ఇక్కడ నుంచే తెలుగు కథ మొదలౌతుందంటున్నారు. ఇంటర్వెల్ దాకా ఆ పాయింట్ ని తీసుకుని, సెకండాఫ్ లో మళ్లీ వాళ్లిద్దరూ ఎలా కలుస్తారు అనే విషయం హైలెట్ గా నడుపుతూ స్క్రిప్టు రాసారట. అంటే సగం కాపీ, సగం సొంతం అన్నమాట. దాంతో ఇప్పుడు రంగ్ దే వాళ్లు కూడా రైట్స్ తీసుకోకపోయినా కేసు వేసే అవకాసాలు తక్కువ. అయితే ఇలాంటి కథతో తెలుగులో గతంలోనూ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. 
 
ఇక నితిన్ కెరీర్ విషయానికి వస్తే..‘శ్రీనివాస కల్యాణం’ తర్వాత స్క్రీన్‌పై చాలా కాలం కనిపించలేదు. ఇప్పుడు వరుస సినిమాలు అనౌన్స్‌ చేసి ఆ గ్యాప్ ని పూడ్చే పనిలో ఉన్నారు. ఆల్రెడీ ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుములతో ‘భీష్మ’ సినిమా తీసి హిట్ కొట్టారు. ఈలోగా చంద్రశేఖర్‌ యేలేటి సినిమాకు మొదలెట్టారు. 

ఇప్పుడు వెంకీ అట్లూరితో ‘రంగ్‌ దే!’ చేస్తున్నారు. కీర్తీ సురేశ్ హీరోయిన్. నితిన్, కీర్తీ కలసి యాక్ట్‌ చేయడం ఇది తొలిసారి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై పీడీవీ ప్రసాద్, నాగవంశీ నిర్మించనున్నారు. ఈ సినిమాకు పీసీ శ్రీరామ్‌ కెమెరామేన్‌. 2020 సమ్మర్‌లో ఈ సినిమా రిలీజ్‌ ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడున్న పరిస్దితుల్లో కష్టం. మరోవైపు కృష్ణచైతన్య దర్శకత్వంలో పవర్ పేట అనే టైటిల్ తో ఓ సినిమా కూడా కమిట్‌ అయిన సంగతి తెలిసిందే.