Asianet News TeluguAsianet News Telugu

విజయవాడలో 'నిన్నుకోరి' బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌

  • నిన్ను కోరి చిత్రంతో మరో సక్సెస్ అందుకున్న నాని
  •  బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన నాని, నివేదా థామస్ ల మూవీ
  • విజయవాడలో 16న బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ నిర్వహించేందుకు  ఏర్పాట్లు
ninnu kori of nani to celebrate success in vijayawada

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దానయ్య డి.వి.వి. నిర్మించిన చిత్రం 'నిన్నుకోరి'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో సూపర్‌హిట్‌ చిత్రంగా అందరి ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అపూర్వ ఆదరణ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఘనంగా వేడుక నిర్వహించనున్నారు.

 

ఈ వేడుకను జూలై 16 సాయంత్రం 6 గంటలకు విజయవాడ బందర్‌ రోడ్‌లోని ఎ-1 కన్వెన్షన్‌ సెంటర్‌లో 'నిన్నుకోరి బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌' నిర్వహించేందుకు చిత్ర యూనిట్‌ నిర్ణయించింది. ఈ సెలబ్రేషన్స్‌లో నేచురల్‌ స్టార్‌ నాని, హీరోయిన్‌ నివేదా థామస్‌, ప్రత్యేక పాత్ర పోషించిన ఆది పినిశెట్టితోపాటు టోటల్‌ యూనిట్‌ పాల్గొంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios