Asianet News TeluguAsianet News Telugu

కోన వెంకట్ కు నిన్ను కోరి చిత్రంతో బ్రేక్

  • నేచురల్ స్టార్ నాని హీరోగా రిలీజైన నిన్నుకోరి చిత్రం
  • నిన్నుకోరి చిత్రం కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన కోన వెంకట్
  • తాజాగా అనూహ్య కలెక్షన్స్ తో పంపిణీ దారులకు లాభాల పంట
ninnu kori gives break to story writer kona venkat

నాచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘నిన్నుకోరి’. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుని దూసుకుపోతోంది. ఇది కేవలం క్లాస్‌ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకే నచ్చుతుందనే ఉద్దేశంతో చాలా తక్కువ ధరలకు అమ్మారట నిర్మాతలు. అయితే అంచనాలను తలకిందులు చేస్తూ మంచి కలెక్షన్లు సాధిస్తోంది ఈ సినిమా.

 

ఓవర్సీస్‌లో అతి త్వరలో మిలియన్‌ డాలర్ల వసూలు మార్కును చేరుకోనుంది ఈ చిత్రం. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.18 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. దీంతో ఇప్పటికే బయ్యర్లందరూ లాభాల్లోకి వచ్చేశారట. కొంతకాలంగా వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న రచయిత కోనవెంకట్‌కు ఈ సినిమా ఊపిరి పోసింది. ఈ సినిమాకు కోన వెంకట్‌ సహ నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios