ఏదేమైనా సరే తన పెళ్లి వేడుకలు ఏ మాత్రం ఆగవని కరోనా కారణంగా వెనక్కి తగ్గేది లేదంటున్నాడు హీరో నిఖిల్ సిద్దార్థ్. వచ్చే నెల 16న నిఖిల్ వివాహానికి ముహూర్తం నిశ్చయమైన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ దృష్ట్యా చాలా వరకు ఈవెంట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. ఎక్కువ మంది గుంపులుగా ఉండవద్దని ప్రభుత్వం ఈ నెల 31వరకు థియేటర్స్, మాల్స్, విద్యాసంస్థలను క్లోజ్ చేయించింది.

ఇక ఏప్రిల్ లో పరిస్థితిని బట్టి మరొకసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే రీసెంట్ గా నిఖిల్ పెళ్లి  వాయిదా పడే అవకాశం ఉన్నట్లు కొన్ని రూమర్స్ వచ్చాయి. అందులో ఎలాంటి నిజం లేదని నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా పెళ్లి మాత్రం ఆగదని అనుకున్న సమయానికి జరుగుతుందని నిఖిల్ వివరణ ఇచ్చాడు.

గతంలోనే ఒక అమ్మాయితో నిశ్చితార్ధం వరకు వచ్చి నిఖిల్ పెళ్లి ఆగిపోయింది. దీంతో ఈ సారి తన పెళ్లి గ్రాండ్ గా అనుకున్న సమయానికి సెలబ్రేట్ చేసుకోవాలని నిఖిల్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. కుదరకపోతే గుడిలో అయినా పెళ్లి చేసుకొని తీరతామని కరోనా నా పెళ్లినని ఆపలేదని చెబుతున్నాడు. నిఖిల్ పల్లవి అనే డాక్టర్ ని పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి తరువాత నిఖిల్ కార్తికేయ 2సినిమాతో మరీంత బిజీ కానున్నాడు.