Asianet News TeluguAsianet News Telugu

#Nikhil : వైసిపి పార్టీ పై నిఖిల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్


సినిమావాళ్లు  రాజకీయ పార్టీలతో లింక్ పెట్టుకుంటే సీన్ సితార అయ్యిపోతుందని చాలా సార్లు ..చాలా సంఘటనలు ప్రూవ్ చేసాయి. అందుకే తెలుగు హీరోలు సాధ్యమైనంత మేరకు రాజకీయాలకు దూరంగా ఉంటారు. అయితే నిఖిల్ ఆ మధ్యన వైసిపి పార్టీకి సపోర్ట్ చేసారు. ఆ టాపిక్ ఇప్పుడు మరోసారి పైకి వచ్చింది

 Nikhil Interesting Comments on AP Politics and  Ysrcp
Author
Hyderabad, First Published Aug 17, 2022, 3:42 PM IST


గత శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్ చిత్రం కార్తికేయ 2  అన్ని భాషల్లోనూ క్రమంగా పుంజుకుంటోంది. తాజాగా ట్రేడ్‌ వర్గాల అంచనా ప్రకారం... 300 శాతం వృద్ధితో దూసుకుపోతోంది. కేవలం ఒక్క సోమవారం నాడే రూ.6.50 కోట్లు వసూలు చేసింది. మొత్తం మూడు రోజుల కలెక్షన్ల విషయానికొస్తే ఏకంగా రూ.17.55 కోట్లు (హిందీ/తెలుగు) రాబట్టినట్లు ట్రేడ్‌ లెక్కలు చెబుతున్నాయి. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో హిందీలో స్క్రీన్‌లను పెంచే పనిలో పడ్డారు ఎగ్జిబిటర్స్‌. ఈ మూవీ సక్సెస్ తో ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు హీరో నిఖిల్‌. 2014లో విడుదలైన కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం.. టాలీవుడ్‌ లో మంచి విజయం సాధించింది.  

 ఈ మూవీ సక్సెస్ సంబరాల్లో ఉన్న నిఖిల్ తాజా రాజకీయ పరిస్థితులపై కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు. ఇకపోతే గత ఎన్నికలలో వైసిపి పార్టీ తరఫున నిఖిల్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అక్కడ వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన అన్నం రెడ్డి అదీప్ రాజుకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఆయన పెందుర్తి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచారు. గతంలో వైసీపీకి సపోర్ట్‌ చేశారు.. మరి ఇప్పుడు అదే పార్టీతో ఉన్నారా అని ప్రశ్నించారు మీడియావారు. 

అందుకు నిఖిల్‌.. ‘నేను సినిమాల్లో ఉన్నాను.. వైసీపీతో కాదు’ అంటూ సమాధానం ఇచ్చారు నిఖిల్. అయితే అంతేకాక ‘నేను గతంలో వైసీపీకి సపోర్ట్ చేశానంటే.. వాళ్లు మా రిలేటివ్స్ అందుకే ప్రచారంలో పాల్గొన్నాను. ఇకపోతే ప్రస్తుతం నేను సినిమాల్లో ఉన్నానని అన్నాడు. వైసీపీతో కాదు.. నా అనుకున్న వాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాను. కాగా గతంలో జేడీ లక్ష్మినారాయణ జనసేనలో ఉన్నప్పుడు ఆయనకి సపోర్ట్ చేశాను. 

హైదరాబాద్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్ అబ్బాయి సాయి పోటీ చేసినప్పుడు ఆయనకి మద్దతు ఇచ్చాను. కాగా టీడీపీకి కూడా సపోర్ట్ చేశాను. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు.. రాజకీయాల గరించి పట్టించుకోను. నాకు తెలిసిన వ్యక్తులు ఎక్కడ ఉన్నా వారికి సపోర్ట్ చేస్తాను. ఇక నేను యాక్టర్‌ని.. నాకు తెలిసింది సినిమాలే అంటూ చెప్పుకొచ్చారు.

ఇక దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో కృష్ణుడి ఆరాధన ఎక్కువ. ఈ నమ్మకంతోనే ‘కార్తికేయ2’ను పాన్‌ ఇండియా మూవీగా విడుదల చేశారు. తొలిరోజు నుంచే అక్కడి ప్రేక్షకులు సినిమాకు త్వరగానే కనెక్ట్‌ అయ్యారు. కథ చిన్నదే అయినా.. కృష్ణతత్వం చుట్టూ తిరిగే కథనం, సంభాషణలు అక్కడి వారిని మెప్పిస్తున్నాయి. పైగా, అనుపమ్‌ఖేర్‌లాంటి నటులు కూడా ఉండటం అదనపు ఆకర్షణ తెచ్చింది.

 దీనికితోడు ఆమిర్‌ఖాన్‌ ‘లాల్‌ సింగ్‌ చడ్డా’, అక్షయ్‌ ‘రక్షాబంధన్‌’లు బాక్సాఫీస్‌ వద్ద మెప్పించలేకపోవడం కూడా ‘కార్తికేయ2’కు కలిసొచ్చింది. బాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా ‘కార్తికేయ2’ విడుదలైంది. చాలా మందికి ఇది సీక్వెల్‌ అన్న విషయం కూడా తెలియదు. ఆమిర్‌, అక్షయ్‌ల ముందు ఇది నిలబడుతుందా? అన్న వాళ్లు కూడా ఉన్నారు. 

కానీ, వాళ్ల సినిమాలు ఆడుతున్న స్క్రీన్స్‌ తగ్గుతుండగా, ‘కార్తికేయ2’ షోలు పెరుగుతుండటం గమనార్హం. గతంలో అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ (Pushpa) కూడా ఎలాంటి అంచనాలు లేకుండా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఒక్కో రోజు స్క్రీన్‌లను పెంచుకుంటూ ‘పుష్కరాజ్‌’ బాలీవుడ్‌కు కిక్కెక్కించాడు. ఇప్పుడు అదే బాటలో ‘కార్తికేయ2’ కూడా నడుస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios