Asianet News TeluguAsianet News Telugu

సూర్య ‘NGK' రివ్యూ!

ఒకప్పుడు తెలుగులో మంచి మార్కెట్ ఉన్న సూర్య...గత కొన్నేళ్లగా  వరుస ఫ్లాపులతో భాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేస్తూనే ఉన్నాడు కానీ ఫలితం కనిపించటం లేదు. 

NGK movie review
Author
Hyderabad, First Published May 31, 2019, 2:30 PM IST

---సూర్య ప్రకాష్ జోశ్యుల

ఒకప్పుడు తెలుగులో మంచి మార్కెట్ ఉన్న సూర్య...గత కొన్నేళ్లగా  వరుస ఫ్లాపులతో భాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేస్తూనే ఉన్నాడు కానీ ఫలితం కనిపించటం లేదు.  అయితే విభిన్నమైన కథలకు విలక్షణమైన చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా నిలిచిన  దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన చిత్రం కావటంతో కొంతమంది ఆయన అభిమానులు ఆశపెట్టుకున్నారు.  సూర్య మాత్రం ఇది తనకు కమ్ బ్యాక్ ఫిలిం అవుతుందని ఆశించి భారీగానే ప్రమోట్ చేసారు. ఎంతచేసినా తెలుగులో ‘ఎన్జీకే'కు బుకింగ్స్ ఆశాజనకంగా లేవు. హిట్ టాక్ వస్తేనే సినిమా లేస్తుంది. ఇంతకీ సినిమా ఎలా ఉంది..సూర్య ని తిరిగి లైమ్ లైట్ లోకి తీసుకువస్తుంందా...కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

 

కథేంటి..

నంద గోపాల కృష్ణ అలియాస్ NGK కు మహర్షి లాంటి ఆలోచన వస్తుంది. దాంతో తను చేస్తున్న కార్పోరేట్ జాబ్ వదిలేసి ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని తన ఊరు శృంగవరపు కోట వస్తాడు.  తల్లికి ఇష్టం లేకపోయినా భార్య (సాయిపల్లవి) కు సపోర్ట్ ఇవ్వటంతో తన ఊళ్లో పాటలు పాడుకుంటూ, అక్కడ జనాలని చైతన్యం చేస్తూ, అక్కడ సమస్యలపై స్పందిస్తూ గడిపేస్తూంటాడు.  అయితే అతను జనాలకు సేవ చేయాలంటే ప్రతీ సారీ ఏదో ఒక సమస్య తనకు వస్తూంటుంది. కానీ రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్లు చాలా ఈజీగా ఆ సమస్యలను సాల్వ్ చేస్తూంటారు. చిన్న కార్పోరేటర్ కూడా పెద్ద పనులు చేయగలుగుతూంటాడు. దాంతో ప్రజలకు మంచి చేయాలంటే రాజకీయనాయకుల వల్లే సాధ్యం అవుతుందని భావిస్తాడు.

దాంతో లోకల్ ఎమ్మల్యే దగ్గర కార్యకర్తగా జాయిన్ అవుతాడు.  . అందులో భాగంగా అధికార పొలిటిక్ పార్టీలోని పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌ వనిత (రకుల్)తో సన్నిహిత సంబంధాలు పెట్టుకొంటాడు.  మెల్లిమెల్లిగా  గ్రామీణ స్థాయి రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడు. అయితే  NGK ఎదుగుదలను తట్టుకోలేక   అధికార, ప్రతిపక్ష పార్టీలు కక్ష కట్టి ఎటాక్స్ మొదలెడతాయి. వారిని ఎన్ జీకే ఎలా తట్టుకున్నాడు.. చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపిక కావడానికి దారి తీసిన పరిస్దితి ఏమిటి, ప్రతికూల పరిస్దితుల్లో భార్య (సాయిపల్లవి) ఎలా స్పందించింది.  వంటి విషయాలతో కూడుకున్నదే మిగతా కథ.  
 

ఎలా ఉంది..

సెల్వ రాఘవన్ వంటి ప్రతిభ గల దర్శకుడు నుంచి వచ్చిన డిజాస్టర్ సినిమా లు కూడా ఇంత దారుణంగా లేవు.  సామాన్యుడు రాజకీయాల్లోకి వస్తే అనే పాయింట్ ని తీసుకుని ఈ చిత్రం ఆ స్టోరీ లైన్ ని ట్రీట్మెంట్ గా మార్చుకోవటంలో విఫలం అయ్యారు. వ్యవసాయం అంటూ మొదలెట్టి రాజకీయాల్లోకి వెళ్ళి చివరకు సీఎం దగ్గర ఆగటంతో కథ చాలా కన్ఫూజ్ గా తయారైందని అర్దమవుతుంది. 

ఫస్టాఫ్ ఫరవాలేదు ఫర్వాలేదు నడిచిపోయింది...ఇక  సెకండాఫ్ లో అదరకొడతామో అనుకుంటే తుస్సు మనిపిస్తాడు. కొంచెం కూడా కదలని  లేజీ స్క్రీన్ ప్లే. రైటింగ్, ప్రజంటేషన్ అన్ని వీకే.   అసలు ఏం చెప్తామని దర్శకుడు మొదలెట్టాడు..ఏం కంక్లూజన్ ఇచ్చాడు అనేది స్పష్టత ఉండదు.  ఫస్టాఫ్  మొత్తం పాత్రల పరిచయం, కథా పరిచయానికే సరిపోయింది. సెకండాఫ్ లో అయినా కథలోకి వస్తాడనుకుంటే అసలు కథే లేదని తేలిపోయింది.  అబరప్ట్ కట్స్, ఇల్లాజికల్ సీన్స్ సినిమాని మన నుంచి దూరం చేస్తాయి. అయితే సెల్వరాఘవన్ స్దాయి మెరుపులు అక్కడక్కడా పొరపాటున జాలువారినప్పుడే ఆనందపడాలి. ఇంటర్వెల్ బ్లాక్ కానీ క్లైమాక్స్ గానీ ఏవీ ఆకట్టుకోవు. ఫన్ కానీ, మాస్ ఎలిమెంట్స్ కానీ లేవు. అసలు సూర్య ఎలా ఈ సినిమా ఒప్పుకున్నాడో అర్దం కాదు.  కొన్ని చోట్ల రానా హీరోగా వచ్చిన  ‘నేనే రాజు నేనే మంత్రి’ గుర్తు వస్తుంది. 


 టెక్నికల్ గా ..

మొదటగా ఈ సినిమాలో సూర్య నటన గురించి మాట్లాడుకోవాలి. ఇంత బోర్ సినిమాని చివరి దాకా చూడగలిగాము అంటే అది సూర్య ప్రతిభనే. సాయి పల్లవి పాత్ర పరమ బోర్. రకుల్ ప్రీతి సింగ్ పాత్ర గతంలో ఓ సినిమాలో వచ్చేసిందే . రిపీట్ చేసారు. సంగీతం విషయానికి వస్తే సెల్వ రాఘవన్, యవన్ కాంబోలో గతంలో క్లాసిక్స్ అనదగ్గ బ్లాక్ బస్టర్ సాంగ్స్ వచ్చాయి. అవి ఇప్పటికి వినపడుతున్నాయి. ఈ సినిమాలో పాటలు రిలీజ్ రోజున కూడా వినపడటం లేదు. అంతలా నిరాశపరిచారు. దానికి తోడు సినిమానే బోర్ అంటే ఈ పాటలు మధ్య మద్యలో వచ్చి బోర్ ని రెట్టింపు చేసే పోగ్రామ్ పెట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ బ్యాడ్ గా ఉంది. డైరక్షన్ తో సహా దాదాపు ప్రతీ డిపార్టమెంట్(సినిమాటోగ్రఫీ మినహా) సినిమాని తమదైన స్టైల్ లో తగ్గించే ప్రయత్నం చివరి దాకా చేస్తూనే ఉన్నాయి. అయినా తమిళ నేటివిటి విపరీతంగా ఉన్న ఈ సినిమాని భరిచటం కష్టమే.
 


ఫైనల్ థాట్

ఎన్నికల ఫలితాలు వచ్చాక..ఇంకా రాజకీయాలేంటి?

 

Rating: 2/5

---
నటీనటులు: సూర్య, సాయిపల్లవి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, దేవరాజ్‌, బాలా సింగ్‌ తదితరులు
సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా
సినిమాటోగ్రఫీ: శివకుమార్‌ విజయన్‌
కూర్పు: ప్రవీణ్‌
నిర్మాణ సంస్థ: డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సెల్వ రాఘవన్‌

 

Follow Us:
Download App:
  • android
  • ios