పవన్ కళ్యాణ్ టాక్ షో.. అనౌన్స్ చేయనున్నారా..?

news channel to announce pawan kalyan's talk show
Highlights

 చాలా కాలంగా పవన్ కళ్యాణ్ టాక్ షో వార్తల్లో నానుతోంది. కానీ ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. కానీ ఇప్పుడు దీనికి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. త్వరలోనే ఓ ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ ను ప్రారంభించనున్నారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా రాజకీయాలకు దగ్గరగా గడుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 'జనసేన' తరఫున పోటీల్లో దిగబోతున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్న పవన్ త్వరలోనే ఓ టాక్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని అంటున్నారు. చాలా కాలంగా పవన్ కళ్యాణ్ టాక్ షో వార్తల్లో నానుతోంది.

కానీ ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. కానీ ఇప్పుడు దీనికి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. త్వరలోనే ఓ ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ ను ప్రారంభించనున్నారు. ఈ ఛానెల్ లో 'జనసేన' అధినేత పవన్ కళ్యాణ్ హోస్ట్ గా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని సదరు న్యూస్ ఛానెల్ అధికారికంగా ప్రకటిస్తుందని సమాచారం.

బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నిర్వహించిన 'సత్యమేవ జయతే' అనే కార్యక్రమం మాదిరి ఈ టాక్ షో ఉంటుందని అంటున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేస్తున్నారట. ఈ షో ద్వారా పవన్ అనేక జాతీయ సమస్యల గురించి జాతీయ స్థాయి ప్రముఖులతో చర్చిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అందరిలో అవగాహన కలిగేలా ఈ కార్యక్రమం ఉంటుందట.  

loader