ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస ఓటములతో సతమతమవుతుంది. అయితే ఆర్‌సీబీ అభిమానులు మాత్రం తమ ఫ్రాంచైజీ ఓటమికి విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మనే కారణమని అంటున్నారు. గతంలో కూడా విరాట్ కోహ్లీ రాణించని సమయంలో అనుష్క స్టేడియంలో ఉండటం వల్లే అలా జరిగిందని ఆమెపై సెటైర్లు వేశారు. దీనిపై విరాట్ స్పందించి ఇంకోసారి అనుష్కపై ఎటువంటి కామెంట్ల చేయవద్దని అభిమానులని కోరాడు. అయినప్పటికీ కొందరు నెటిజన్లు తమ తీరు మార్చుకోవడం లేదు. చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడిపోవడంతో అభిమానులు మరోసారి అనుష్కపై విరుచుకుపడ్డారు. అనుష్క స్టేడియంలో ఉండటం వల్లే విరాట్ సరిగ్గా బ్యాటింగ్ చేయలేదని మండిపడుతున్నారు.