సెలబ్రిటీలకు సోషల్ మీడియా వేధింపులు తప్పటం లేదు. ప్రముఖులు మంచి ఉద్దేశంతో చేసే ట్వీట్స్‌ విషయంలో కూడా కొంత మంది ఆకతాయిలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మాస్‌ కమర్షియల్  చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్‌కు అలాంటి అనుభవమే ఎదురైంది. ఓ వ్యక్తి కోసం అంబులెన్స్ పంపించాలంటూ హరీష్ శంకర్ చేసి ట్వీట్‌ వెంకట్‌ అనే వ్యక్తి కౌంటర్ వేశాడు.

మలక్‌పేట దగ్గరలో ఓ  70 ఏళ్ల వ్యక్తి శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నాడని, వెంటనే అక్కడికి అంబులెన్స్ పంపి సాయం  చేయాలని హరీష్ తన ట్విటర్‌ ద్వారా హాస్పిటల్‌ సిబ్బందిని కోరాడు. అయితే ఈ ట్వీట్‌పై స్పందించిన వెంకీ అనే పేరుతో ఉన్న ఎకౌంట్‌ నుంచి ఓ వ్యక్తి `కాల్‌ చేయొచ్చుగా.. నువ్వు ట్వీట్‌ వేసేలోపు పేషెంట్‌కి ఏమైనా అయితే, బుర్ర ఉందిగా కొంచెం వాడు` అంటూ కామెంట్ చేశాడు.

అయితే ఈ ట్వీట్‌పై స్పందించిన హరీష్ శంకర్ వీడిని ఏం అనాలో తెలీట్లేదు ఫ్రెండ్స్ అంటూ రిప్లై ఇచ్చాడు. ఆ ట్వీట్ మీద కూడా వెంకీ అనే వ్యక్తి స్పందించాడు. `నీకు తెలియదనే ముందే బుర్ర వాడమన్నా` అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ కాన్వర్జేషన్‌ పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొద్ది మంది వెంకీ చెప్పింది కరెక్టేగా అని కామెంట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం హరీష్ మంచి ఉద్దేశంతో చేసిన పనిపై ఇలా కామెంట్‌ చేయటం కరెక్ట్‌ కాదంటున్నారు.