Asianet News TeluguAsianet News Telugu

షాకిచ్చే రేటు: నెట్ ఫ్లిక్స్ చేతికే నాగ్ ఫిల్మ్


అందుతున్న సమాచారం మేరకు నెట్ ఫ్లిక్స్ వారు ఈ చిత్రం రైట్స్ ని ఫ్యాన్సీ రేటు ఇచ్చి తీసేసుకున్నారు. ఆ రేటు ఇప్పటిదాకా నాగ్ ఏ చిత్రానికి పలకలేదు. దాంతో ఈ కరోనా సమయంలో నాగ్ సినిమాకు ఆ రేట్ ఇవ్వటం ఆశ్చర్యంగా మారింది. ఇంతకీ ఆ రేటు ఎంతా అంటే అక్షరాలా 27 కోట్లు. కేవలం ఓటీటి రేట్ మాత్రమే ఇది. శాటిలైట్ ని మరో పది కోట్లకు నిర్మాత అమ్ముకోవచ్చు. 
 

Netflix buys Wild Dog for 27 Cr jsp
Author
Hyderabad, First Published Jan 2, 2021, 12:31 PM IST

నాగార్జున హీరోగా అహిషోర్‌ సోల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. ఈ సినిమా ఆరు నెలల లాక్‌డౌన్‌ విరామం తరువాత మళ్లీ పట్టాలెక్కింది. దాదాపు ఈ చిత్రం షూటింగ్ పూర్తైంది.  పోస్ట్ ప్రొడక్షన్ దశని కూడా దాటింది.  కౌంటర్ టెర్రరిజం బ్యాక్  డ్రాప్ లో రూపొందే ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే రోజున రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. అయితే ఇప్పుడున్న పరిస్దితుల్లో థియోటర్స్ లో రిలీజ్ చేసే పరిస్దితి కనపడటం లేదు. దాంతో ఓటీటిలో రిలీజ్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.  

అందుతున్న సమాచారం మేరకు నెట్ ఫ్లిక్స్ వారు ఈ చిత్రం రైట్స్ ని ఫ్యాన్సీ రేటు ఇచ్చి తీసేసుకున్నారు. ఆ రేటు ఇప్పటిదాకా నాగ్ ఏ చిత్రానికి పలకలేదు. దాంతో ఈ కరోనా సమయంలో నాగ్ సినిమాకు ఆ రేట్ ఇవ్వటం ఆశ్చర్యంగా మారింది. ఇంతకీ ఆ రేటు ఎంతా అంటే అక్షరాలా 27 కోట్లు. కేవలం ఓటీటి రేట్ మాత్రమే ఇది. శాటిలైట్ ని మరో పది కోట్లకు నిర్మాత అమ్ముకోవచ్చు. 

  ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. నాగార్జున సైతం ఓటీటికు ఈ సినిమా కు ఓకే చేయటం పెద్ద సర్ఫైజ్ గా చెప్పుకుంటున్నారు.  ఈ చిత్రంలో నాగార్జున ఏసీపీ విజయ్‌ వర్మ అనే శక్తిమంతమైన పోలీస్‌ పాత్ర పోషిస్తున్నారు.  కొందరు సంఘ విద్రోహ శక్తులను తుదముట్టించేందుకు ఓ ఆపరేషన్‌ కోసం రంగంలోకి దిగుతారు విజయ్‌ వర్మ. మరి ఆ రహస్య ఆపరేషన్‌ ఏంటి? ఆ విద్రోహ శక్తుల్ని ఆయన ఎలా మట్టు  పెట్టారు? వంటివి తెలియాలంటే ‘వైల్డ్‌డాగ్‌’ చిత్రం  చూడాల్సిందే. 

‘‘వాస్తవ ఘటనల ఆధారంగా అల్లిన కథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో నాగ్‌ ఓ భిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. ఇందులో నాగ్‌ ‘వైల్డ్‌డాగ్‌’ బృంద సభ్యులుగా అలీ రెజా, ఆర్యా పండిట్‌, కాలెబ్‌ మాథ్యూస్‌, రుద్రా గౌడ్‌, హష్వంత్‌ మనోహర్‌ కనిపించనున్నారు. సయామీ ఖేర్‌ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుంది’’అని చిత్ర  టీమ్ తెలిపింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios