బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం రేపింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ కేసులో రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యులను విచారించిన అధికారులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. రియా మరియు ఆమె తమ్ముడు షోవిక్ చక్రవర్తిని ఎన్ సి బీ అధికారులు విచారించడం జరిగింది. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేయగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్దా కపూర్ మరియు సారా అలీ ఖాన్ లను కూడా అధికారులు విచారించారు. అంత పెద్ద సెలెబ్రిటీలు డ్రగ్స్ కేసు విచారణ ఎదుర్కోవడం సంచలనం రేపింది. 
 
డ్రగ్స్ కేసు సద్దుమణుగుతుంది అనుకుంటున్న తరుణంలో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కి అధికారులు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఎన్ సి బి అధికారులు కరణ్ జోహార్ విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు పంపారట. గతంలో బాలీవుడ్ స్టార్స్ అందరికీ కరణ్ తన నివాసంలో పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కరణ్ జోహార్ ఇంటిలో జరిగిన ఈ సెలెబ్రిటీ పార్టీలో డ్రగ్స్ వాడారన్న ఆరోపణలు ఉన్నాయి. 
 
సదరు వీడియోపై వివరణ కోరుతూ కరణ్ జోహార్ కి అధికారులు నోటీసులు పంపారట. కాగా వైరల్ అయిన ఆ వీడియోలో బాలీవుడ్ స్టార్స్ లో అనేక మంది ప్రముఖులు ఉన్నారు. దీపికా పదుకొనె, మలైకా అరోరా, అర్జున్ కపూర్, వరుణ్ ధావన్, రన్బీర్ కపూర్, షాహిద్ కపూర్ వంటి స్టార్స్ ఆ పార్టీలో ఉన్నారు. ఆ వీడియోలో ఆ స్టార్స్ తీరు కూడా మత్తులో ఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. మరి ఈ వీడియోపై కరణ్ జోహార్ ఏమి వివరణ ఇస్తారో చూడాలి. ఎవరు ఏమనుకున్నా... బాలీవుడ్ లో డ్రగ్ కల్చర్ ఉంది అనేది వాస్తవం. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)