తిరుమల మాఢవీధుల్లో నయనతార దంపతులు పాదరక్షలు ధరించడం, ఫోటో షూట్‌ నిర్వహించడం వివాదాస్పదమైంది. దీనిపై స్పందించిన తితిదే విజిలెన్స్ అధికారి బాల్‌ రెడ్డి.. న్యాయ నిపుణుల సలహాతో నయనతార దంపతులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

సినీ నటి నయనతార, విఘ్నేశ్‌ల వివాహం గురువారం ఉదయం చెన్నై సమీపంలోని మహాబలిపురం వడనెమ్మేలిలోని షెరటాన్‌ గ్రాండ్‌ హోటల్‌లో జరిగిన సంగతి తెలిసిందే. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంట శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత విఘ్నేశ్ దంపతుల ఫొటో షూట్ జరిగింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన సినీ నటి నయనతార, ఆమె భర్త విఘ్నేష్ తో కలిసి ఆలయ పరిసరాలతోపాటు మాడవీధుల్లో చెప్పులు వేసుకుని తిరగటం జరిగింది. తెలిసి చేసినా తెలియక చేసినా అది ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీస్తోంది. ఫొటో షూట్ లో భాగంగా వీరిద్దరితోపాటు కెమెరామెన్లు, అసిస్టెంట్లు కూడా చెప్పులు, షూలు వేసుకుని తిరిగారు. టీటీడీ నయనతార, విగ్నేశ్ జంటపై, అలాగే ఫోటో షూట్ చేసిన వారిపై కేసు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొంది.

తిరుమల మాఢవీధుల్లో నయనతార దంపతులు పాదరక్షలు ధరించడం, ఫోటో షూట్‌ నిర్వహించడం వివాదాస్పదమైంది. దీనిపై స్పందించిన తితిదే విజిలెన్స్ అధికారి బాల్‌ రెడ్డి.. న్యాయ నిపుణుల సలహాతో నయనతార దంపతులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

నయనతార పాదరక్షలు ధరించి తిరుమాడ వీధుల్లో నడిచారని విమర్శలు రావడంతో తితిదే అధికారులు స్పందించారు. ఈ ఘటనపై విజిలెన్స్‌ అధికారి బాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మాడ వీధుల్లో నయనతార పాదరక్షలు ధరించడం దురదృష్టకరమన్నారు. ఆలయం ముందు ఫొటో షూట్‌ చేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. న్యాయనిపుణుల సలహాతో నయనతారపై చర్యలు తీసుకుంటామన్నారు. ఫొటో షూట్‌ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బందిపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నయనతార పాదరక్షలు ధరించి రావడం శ్రీవారి సేవకుల వైఫల్యమేనన్న బాల్‌రెడ్డి... భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామన్నారు. 

నయనతార- విఘ్నేశ్‌ శివన్‌ల వివాహం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. మహాబలిపురంలోని రిసార్ట్‌లోని జరిగిన వీరి వివాహ వేడుకకు సినీ,రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.చెన్నై సమీపంలోని మహాబలిపురం వడనెమ్మేలిలోని షెరటాన్‌ గ్రాండ్‌ హోటల్‌లో జరిగింది. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంట శ్రీవారిని దర్శించుకున్నారు.