కోలీవుడ్ ప్రేమ జంట విగ్నేష్ శివన్, నయనతార న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ అదిరిపోయాయి. హాట్ కపుల్ తమదైన శైలిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. నయనతారతో తన రొమాంటిక్ సెలెబ్రేషన్స్ కి సంబందించిన ఫోటోలు విగ్నేష్ శివన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. మెరిసిపోయే బ్లూ బాడీ కాన్ డ్రెస్ లో నయనతార సెక్సీగా తయారైంది. ఇక తన ఫ్యాన్స్ అందరికీ న్యూ ఇయర్ విషెష్ తెలియజేశారు విగ్నేష్. 


జీవితంలో ఉన్నతమైన దశకు చేరుకున్నామని విగ్నేష్ శివన్ వాళ్ళిద్దరినీ ఉద్దేసించి అన్నారు.  అలాగే 2021 అందరికీ సంతోషం పంచాలని, సుఖ శాంతులు కలగాలని, విజయాలు సాధించాలని కోరుకున్నారు. విగ్నేష్ శివన్, నయనతార బర్త్ డే సెలెబ్రేషన్స్ ఫోటోలు... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇక అన్ని వేడుకలను నయనతార, విగ్నేష్ శివన్ కలిసి జరుపుకుంటారు. బర్త్ డే వేడుకల కోసమైతే ప్రత్యేకంగా నచ్చిన ప్రదేశాలకు చెక్కేస్తారు. ఐదేళ్లకు పైగా ప్రేమించుకుంటున్న ఈ జంట, పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో విగ్నేష్ ని ఇదే మాట అడుగగా... డేటింగ్ బోర్ కొట్టినప్పుడు పెళ్లి చేసుకుంటాం అని డైరెక్ట్ గా చెప్పేశాడు.