అప్పుడెప్పుడో చంటబ్బాయి వచ్చింది. ఆ తర్వాత చాలా కాలం తరువాత తెలుగు తెర మీద వచ్చిన డిటెక్టివ్‌ తరహా సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఈ సినిమాతో క్యారెక్టర్ నటుడు నవీన్‌ పొలిశెట్టి హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు.  ఈ నేపధ్యంలో బాలయ్య,బోయపాటి కాంబినేషన్ లో రూపొందే చిత్రంలో ఓ కీలకమైన పాత్రకు నవీన్ ని అడిగినట్లు వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. ఈ విషయమై నవీన్ ని మీడియావారు సంప్రదించటం జరిగింది. 

నవీన్ మాట్లాడుతూ ఆ వార్త కేవలం రూమర్ అని కొట్టిపారేసారు. తనను బాలయ్య సినిమాకు తనను అసలు ఎవరూ అడగలేదని అన్నారు. ప్రస్తుతం తెలుగులో జాతి రత్నాలు అనే చిత్రం మాత్రమే చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.  అశ్వనీదత్‌ కుమార్తె స్వప్న నిర్మిస్తున్న ఈ సినిమాలో నవీన్‌ ఓ గమ్మత్తైన పాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు. అలాగే  ఏజెంట్‌కు పార్ట్‌–2 ఎప్పుడు అని అందరూ అడుగుతున్నారు. మేం ఉన్నంతకాలం ఈ సినిమాకు ఫ్రాంచైజీ వస్తూనే ఉంటుంది’’  అన్నారు. 

అలాగే ఈ సినిమాతో పాటు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ నిర్మాతలు కూడా నవీన్‌ హీరోగా మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మరో రెండు ప్రాజెక్ట్స్‌ చర్చల దశలో ఉన్నట్టుగా తెలుస్తోంది, ఒక్క సినిమాతోనే అం‍దరి దృష్టిని ఆకర్షించిన నవీన్ పొలిశెట్టి  తన   సక్సెస్‌ ట్రాక్‌ను తెలివిగా కంటిన్యూ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.