Asianet News TeluguAsianet News Telugu

'టక్ జగదీష్' ట్రైలర్ : ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో కట్టిపడేస్తున్న నాని

అనేక వివాదాల నడుమ టక్ జగదీష్ చిత్రం సెప్టెంబర్ 10న బిగ్గెస్ట్ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 10న రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.

Natural Star Nani Tuck Jagadish trailer released
Author
Hyderabad, First Published Sep 1, 2021, 6:36 PM IST

నేచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీశ్ చిత్రం ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అందుకు కారణం ఓటిటి రిలీజ్. తనకు ఇష్టం లేకున్నా ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయాల్సి వస్తోందని నాని ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. 

అనేక వివాదాల నడుమ టక్ జగదీష్ చిత్రం సెప్టెంబర్ 10న బిగ్గెస్ట్ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 10న రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే టక్ జగదీశ్ చిత్రం నాని స్టైల్ లో సాగే పర్ఫెక్ట్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ మూవీగా అర్థం అవుతోంది. 

భూదేవి పురం అనే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం కథ సాగుతుంది. ఆ వీరేంద్రకు భయపడకుండా జనం కోసం ఎవరో ఒకరు నిలబడాలి కదా అని జగపతి బాబు అంటుంటే నాని ఎంట్రీ ఉంటుంది. ఈ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ స్టైలిష్ గా డిజైన్ చేసినట్లు ఉన్నారు. 

ఫ్యామిలీ ఆడియన్స్ కి కావలసిన అంశాలు పుష్కలంగా ఉన్నాయి. యువతని ఆకట్టుకునేలా నాని, రీతూ వర్మ మధ్య లవ్ ట్రాక్ ఉండబోతోంది. ఈ చిత్రంలో రీతూ వర్మ గుమ్మడి వరలక్ష్మి అనే విఆర్వో పాత్రలో నటిస్తోంది. 

ట్రైలర్ 45 సెకండ్ల తర్వాత నుంచి కంప్లీట్ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. భూదేవి పురంలో భూ వివాదాల చుట్టూ దర్శకుడు కథ అల్లినట్లు తెలుస్తోంది. 'భూ కక్షలు లేని భూదేవి పురం చూడాలనేది మా నాన్న కోరిక.. ఇప్పుడు అది నా బాధ్యత' అని నాని చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. 

ట్రైలర్ చివర్లో చిన్న పాపతో నాని చెప్పే చెప్పే డైలాగ్ హైలైట్ అనే చెప్పాలి. ఓ వైపు బాధని దిగమింగుతూ గాగుల్స్ ధరించి నాని 'తెలియట్లేదు అమ్మా' అని చెప్పే విధానం హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఓవరాల్ గా ఈ వినాయక చవితికి నాని పర్ఫెక్ట్ ప్యాకేజ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎమోటినల్ డ్రామాలో తాను కింగ్ ని శివ నిర్వాణ మరోసారి నిరూపించుకున్నాడు. గోపి సుందర్, తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. షైన్ స్క్రీన్ సంస్థ ఈ మూవీని నిర్మించింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios