రంగస్థలం సినిమా చూసి నారా లోకేష్ ఏమన్నాడో తెలుసా.?

First Published 30, Apr 2018, 1:41 PM IST
Naraloakesh watches rangasthalam
Highlights

రంగస్థలం సినిమా చూసి నారా లోకేష్ ఏమన్నాడో తెలుసా.?

రామ్‌చరణ్‌ నటించిన ‘రంగస్థలం’ మేనియా నుంచి ప్రేక్షకులు ఇంకా తేరుకోలేదు. ఇప్పటికే దాదాపు సినీ ప్రముఖులంతా ఈ సినిమా చూశాం.. అద్భుతంగా ఉందంటూ సోషల్‌మీడియా ద్వారా ప్రశంసల జల్లులు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌ వీక్షించారట.
 
ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ.. ‘మాకు ‘రంగస్థలం’ లాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించినందుకు రామ్‌చరణ్‌, సుకుమార్‌కు ధన్యవాదాలు. సినిమా చూసిన చాలా సేపటివరకు ఆ పాత్రలు మనతోనే ఉండిపోతాయి. గ్రేట్‌ వర్క్‌ గాయ్స్‌’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఈ ట్వీట్‌కు రామ్‌చరణ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా స్పందిస్తూ..‘థాంక్యూ నారా లోకేశ్ గారూ’ అని పేర్కొన్నారు.‘రంగస్థలం’ సినిమాకు సుకుమార్‌ దర్శకత్వం వహించారు. ఇందులో రామ్‌చరణ్ చిట్టిబాబుగా ఆయనకు జోడీగా సమంత రామలక్ష్మిగా నటించారు. ప్రముఖ యాంకర్‌ అనసూయ రంగమ్మత్త పాత్రను పోషించారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్లో మెప్పించారు. మార్చి 30న విడుదలైన ఈ చిత్రం మూడురోజుల్లోనే రూ.100 కోట్లు రాబట్టి చరణ్‌ కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్‌ చిత్రంగా నిలిచింది.

loader