Asianet News TeluguAsianet News Telugu

"పుష్ప"...ఇదిగో పులి అంటే,అదిగో తోక

 ఈ సినిమాలో నారా రోహిత్ ..మరో కీలకమైన పాత్రలో నటిస్తున్నారని చెప్తున్నారు. రంగస్దలంలో ఆది పినిశెట్టి కు ఎలా లైఫ్ వచ్చిందో అదే విధంగా నారా రోహిత్ కు సైతం ఈ సినిమా క్రేజ్ తెస్తుందని చెప్తున్నారు. ఇందులో నిజమెంత అనేది ఎవరికీ తెలియదు.

Nara Rohit as Police in Allu Arjuns Pushpa Movie
Author
Hyderabad, First Published Sep 7, 2020, 1:07 PM IST

'రంగస్థలం' వంటి సూపర్ హిట్  సినిమా తర్వాత పుష్ప అనే సినిమాని చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.  ప్రస్తుతం కరోనా ప్రభావంతో సినిమా వాయిదా పడింది. ఎర్ర గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని , ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని సమాచారం.

ఇదీ ఇప్పటిదాకా ఈ సినిమా గురించి జనాలకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మరో టాక్ ఈ సినిమా గురించి బయిటకు వచ్చింది. ఈ సినిమాలో నారా రోహిత్ ..మరో కీలకమైన పాత్రలో నటిస్తున్నారని చెప్తున్నారు. రంగస్దలంలో ఆది పినిశెట్టి కు ఎలా లైఫ్ వచ్చిందో అదే విధంగా నారా రోహిత్ కు సైతం ఈ సినిమా క్రేజ్ తెస్తుందని చెప్తున్నారు. ఇందులో నిజమెంత అనేది ఎవరికీ తెలియదు.

 ఈ రూమర్ ప్రచారంలోకి రాగానే దీనికి మరింత మశాలా అద్దుతూ ..ఇదిగో పులి అంటే అదిగో తోక అన్న విధంగా...నారా రోహిత్ చేయబోయే పాత్తర అంటూ కొన్ని న్యూస్ లు హల్ చల్ చేస్తున్నాయి. అదేమిటంటే..  ఈ సినిమాలో ఓ కీలకమైన పోలీసాఫీసర్ పాత్ర ఉందట. ఆ పాత్రకు నారా రోహిత్ అయితే సరిగ్గా సరిపోతాడని భావించి యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది అంటున్నారు. 

అప్పట్లో ఒకడుండేవాడు, రౌడీ ఫెలో, శమంతకమణి లాంటి సినిమాల్లో రోహిత్ పోషించిన పోలీస్ పాత్రలకు మంచి క్రేజ్ వచ్చింది. అందుకే పుష్ప సినిమాలో కూడా ఓ డిఫరెంట్ పోలీస్ అదికారి పాత్రకు నారా రోహిత్ ను తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరికొంతమందైతే మణిరత్నం చిత్రం నవాబ్ లో విజయ్ సేతుపతి చేసిన పాత్ర లాంటిది ఈ సినిమాలో నారా రోహిత్ చేయబోయేది అంటూ మరో అడుగు ముందుకేసి చెప్తున్నారు. మొత్తానికి ఓ చిన్న న్యూస్ లేదా రూమర్..మరిన్నిటికి సమర్దవంతంగా దారి చూపుతుందన్నమాట. 

Follow Us:
Download App:
  • android
  • ios