న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం 'వి' . ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ  దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమాలో నాని తో పాటు హీరో సుదీర్ బాబు కూడా నటిస్తూండటంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. నివేద థామస్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్న...ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించగా, సీరియల్ కిల్లర్ గా నాని నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ  సినిమాకు క్లైమాక్స్ లో ఓ వచ్చే ట్విస్ట్ ఓ రేంజిలో ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ ఓపెన్ ఎండ్ తో ప్లాన్ చేసారట.

అంటే సినిమాలో సీరియల్ కిల్లర్ గా కనిపించే నాని...దొరికినట్లే దొరికి మిస్సై పోతాడట. సీరియల్ హత్యలు జరుగుతూనే ఉంటాయిట. సీక్వెల్ కు లీడ్ ఇస్తూ ఈ సినిమాని ఎండ్ చేస్తారట. ఇక సినిమాలో రెగ్యులర్ గా ట్విస్ట్ లు వస్తూనే ఉంటాయిని,అవి చూసేవారికి మంచి థ్రిల్లింగ్ ఎక్సపీరియన్స్ ఇస్తాయని అంటున్నారు. అయితే క్లైమాక్స్ మాత్రం షాక్ ఇస్తుందని చెప్తున్నారు.  

  హీరోగా దూసుకుపోతున్న నానీ, విలన్ పాత్రను చేయడానికి కారణం కొత్తగా కనిపించడం కోసం మాత్రమే కాదని క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ నచ్చే అంటున్నారు.  ఆ ఫైనల్ ట్విస్ట్ ను ఆవిష్కరించే తీరు ఒక రేంజ్ లో ఉంటుందనీ , తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ అంటున్నారు.  ఇప్పటికే విడుదలైన  టీజర్ లో నాని విలనిజమ్ తో బాగా ఆకట్టుకున్నాడు.
 
ఇప్పటివరకూ ఇంద్రగంటి నానితో చేసిన రెండు చిత్రాల్లో నానిని డిఫ‌రెంట్‌గా చూపించి సక్సెస్ కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు నానిని మ‌రో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో ఆవిష్క‌రిస్తున్నాడు. అలాగే సుధీర్‌బాబుతో `స‌మ్మోహ‌నం` వంటి బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీని తెర‌కెక్కించిన ఇంద్ర‌గంటి ఈసారి సుధీర్‌ ను ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ రోల్‌ లో చూపిస్తున్నాడు.  ప్రముఖ నిర్మాత దిల్‌రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మాణంలో శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లుగా  ఈ సినిమా నిర్మాణమైంది.