నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన తారక రత్న 'ఒకటో నంబర్ కుర్రాడు' చిత్రంతో తన కెరీర్ ని ఘనంగా ఆరంభించాడు. ఈ చిత్రం తర్వాత తారక రత్నకి వచ్చినన్ని ఆఫర్స్ మరే  హీరోకి రాలేదంటే అతిశయోక్తి కాదు.

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన తారక రత్న 'ఒకటో నంబర్ కుర్రాడు' చిత్రంతో తన కెరీర్ ని ఘనంగా ఆరంభించాడు. ఈ చిత్రం తర్వాత తారక రత్నకి వచ్చినన్ని ఆఫర్స్ మరే హీరోకి రాలేదంటే అతిశయోక్తి కాదు. ఏకంగా 13 చిత్రాలకు సైన్ చేశాడు. వరుసగా పరాజయాలు ఎదురవడంతో.. తారక రత్న నటించాల్సిన తదుపరి చిత్రాలు అటకెక్కాయి.

చాలా కాలం గ్యాప్ తర్వాత తారక రత్న విలన్ గా కూడా ట్రై చేశాడు. అది కూడా కలసి రాలేదు. ఇప్పుడు 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులని పలకరించాడు. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా తారక రత్న ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

ఓ ఇంటర్వ్యూలో తారక రత్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. తారక రత్న చెప్పేది వింటే.. అతడికి పవన్ తో అంత చనువు ఉందా అనిపిస్తుంది. నేను పవన్ కళ్యాణ్ గారిని బాబాయ్ అని పిలుస్తుంటాను. మేము వాళ్ళ ఫ్యామిలీ సినిమాలు కూడా చూశాం. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఏదైనా చేయాలని కమిటై ఉన్న వ్యక్తి. ఆయన బలం ఆయనకి ఉంది. 

ఇక జనసేన, టిడిపి పొత్తు.. సీఎం అభ్యర్థి ఎవరు ఇవన్నీ రాజకీయంగా తీసుకునే నిర్ణయాలు. వాటిపై నిర్ణయం మావయ్య చంద్రబాబు గారు తీసుకుంటారు. సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ రూమర్స్ మాత్రమే అని తారక రత్న అన్నారు. తనకి కూడా రాజకీయాలపై, ప్రజలకు సేవ చేయడంపై ఆసక్తి ఉందని.. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని అన్నారు.