తాజాగా ఆయనకు మరో శస్త్ర చికిత్సను డాక్టర్లు నిర్వహించారని , ఓ ఫొటో తో సహితంగా వార్త మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వార్త నిజం కాదని , ఫేక్ అంటున్నారు. ఏది నిజమో..ఏది అబద్దమో తెలియాల్సి ఉంది.


'అఖండ' సినిమాతో పెద్ద హిట్ ని అందుకున్న బాలకృష్ణ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఆయన నటిస్తున్నారు. తాజాగా ఆయన భుజానికి ఆపరేషన్ జరిగింది. 'అఖండ' సినిమా షూటింగ్ సందర్భంగా ఆయనకు చిన్న ప్రమాదం జరిగింది. దీంతో గతంలో హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో ఆయన భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. తాజాగా ఆయనకు మరో శస్త్ర చికిత్సను డాక్టర్లు నిర్వహించారని , ఓ ఫొటో తో సహితంగా వార్త మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వార్త నిజం కాదని , ఫేక్ అంటున్నారు. ఏది నిజమో..ఏది అబద్దమో తెలియాల్సి ఉంది. అబద్దమే అయితే ఆ ఫొటో ఎప్పటిది...ఈ రూమర్ వెనక ఎవరు ఉన్నారని అభిమానులు తెలుసుకోవాలనుకుంటున్నారు.

సినిమాల విషయానికి వస్తే..బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. కెరియర్ పరంగా బాలకృష్ణకి ఇది 107వ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్లింది. రాయలసీమ నేపథ్యంలో ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. 

ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నాడని చెబుతున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో, పవర్ఫుల్ విలన్ గా దునియా విజయ్ కనిపించనున్నాడు. ఈ దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.