Asianet News TeluguAsianet News Telugu

Sankranthi 2022 : అక్క ఇంట్లో బాలయ్య సంక్రాంతి సంబరాలు.. సతీ సమేతంగా కారంచేడుకు..

నిత్యం రాజకీయ పనులు.. సినిమా పనుల మధ్య బిజీగా గడిపే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna).. సంక్రాంతి సంబరాల కోసం ప్రకాశం జిల్లా చేరుకున్నారు. కారంచేడు లో బాలయ్య బాబు  సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు .

Nandamuri Balakrishna Sankranthi Celebrations in Karamchedu
Author
Hyderabad, First Published Jan 14, 2022, 8:07 AM IST

నిత్యం రాజకీయ పనులు.. సినిమా పనుల మధ్య బిజీగా గడిపే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna).. సంక్రాంతి సంబరాల కోసం ప్రకాశం జిల్లా చేరుకున్నారు. కారంచేడు లో బాలయ్య బాబు  సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు .

నట సింహం బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రకాంశం జిల్లా కారంచేడు కు వెళ్ళారు. కుటుంబంతో పాటు కారం చేడు వెళ్లిన బాలయ్య.. సంక్రాంతిని అక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అక్క దగ్గుబాటి పురంధరీశ్వరి ఇంట సంక్రాంతిని జరుపుకోబోతున్నారు. నిత్యం రాజకీయ,సినిమా పనుల్లో బిజీగా ఉండే బాలకృష్ణ.. ఈ రెండు రోజులు చిల్ అవ్వబోతున్నారు. నందమూరి కుటుంబానికి చెందిన జయకృష్ణ ఫ్యామిలీ కూడా కారంచేడు చేరుకున్నారు .

ప్రతీ సంక్రాంతిని కారంచేడులో దగ్గుబాటి ఫ్యామిలీ ఘనంగా గా జరుపుకుంటారు. అందులో నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా కొంత మంది హాజరవుతుంటారు. అయితే ప్రతీసారి .. బాలయ్య సతీమని వసుందర మాత్రమే ఎక్కువగా ఈ సంబరాలకు హాజరు అయ్యేవారు. అయితే ఈసారి మాత్రం బాలయ్య బాబు(Nandamuri Balakrishna) కుటుంబంతో సహా సంక్రాంతి సంబరాల కోసం కారంచేడు చేరుకోవడంతో.. అక్కడ సందడి వాతావరణం నెలకొంది. నందమూరి కుటుబం రాకతో అక్కడ హడావిడి పెరిగిపోయింది గ్రామం నుంచి ప్రజలు వారికి ఘనంగా స్వాగతం పలికారు.

 

అయితే నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యంలో అక్కడికి చేరుకోవడంతో సందడి వాతావరణం ఏర్పడింది. కాని కరోనా కారణాలను దృష్టిలో పెట్టుకుని ఎవరిని లోపలకి అనుమతించడం లేదు. అభిమానులకు దూరంగా ఉండే అభివాదాలు చేశారు బాలయ్య(Nandamuri Balakrishna). అక్కడ అందరిని ఆప్యాయంగా పలకరించారు. చుట్టు పక్కల పరిసరాలు కలియచూస్తూ.. ఇదివరకటి తీపి జ్ణాపకాలు గుర్తు చేసుకున్నారు.

Also Read: Balakrishna Allu Arjun Multi Starar: బాలయ్యతో బన్నీ మల్టీ స్టారర్.. ?ఫ్యాన్స్ కు పండగే..!

 

Follow Us:
Download App:
  • android
  • ios