మొత్తానికి మహేష్ తాజా చిత్రం లాంచింగ్ కు రంగం సిద్దమైంది. పరుశరామ్ దర్శకత్వంలో సినిమా చెయ్యటానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫార్మల్ పూజతో ఈ సినిమా లాంచ్ కానుంది. ఈ మేరకు మైత్రీ మూవీస్ వారు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం మహేష్,నిర్మాతలతో కలిసి డెసిషన్ తీసుకున్నారు. అలాగే ఎప్పటిలాగే మహేష్ ఈ లాంచింగ్ కు హాజరు కారు. గత కొంత కాలంగా మహేష్ తన కొత్త చిత్రాల లాంచింగ్ లో పాల్గొనటం లేదు. ఆయన భార్య నమ్రత శిరోద్కర్ మాత్రం మహేష్ తరుపున పూజకు హాజరవుతూ వస్తున్నారు. ఇది ఓ ఆనవాయిగా కంటిన్యూ అవుతోంది. ఈ సారి కూడా మహేష్ కొత్త చిత్రం లాంచింగ్ ని మే 31న నమ్రత చేతుల మీదుగా జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
 ప్రస్తుతం ఈ సినిమాకు  సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శవవేగంతో ఫోన్ లలో, వీడియో కాల్స్ లో జరుగుతున్నాయి. మెచ్యూరిటీతో కూడిన ప్రేమకథగా ఈ సినిమా నడుస్తుందని సమాచారం. ఈ చిత్రం పూజ చేసి , ఫస్ట్ లుక్ ని సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు (మే 31)న  లాంచ్ చేయాలని భావించారు. ఆ రోజున ఈ సినిమా టైటిల్ ను రివీల్ అవుతుంది. లిమెటెడ్ బడ్జెట్ లో తయారయ్యే ఈ సినిమా ...రిలీజ్ కు ముందే లాభాలు బాటలో నడిచేలా ప్లాన్ చేస్తున్నారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు… స‌రిలేరు నీకెవ్వ‌రూ సినిమా సంక్రాంతికి విడుదలయ్యి..ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ సినిమా తర్వాత మహేష్ ఏ దర్శకుడుతో చేయబోతున్నారనేది మీడియా వర్గాల్లోనే కాదు సినిమా వర్గాల్లోనూ పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే స్టార్ డైరక్టర్స్ అందరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మహేష్ క్రిందకు దిగి కొత్త దర్శకులతో చేసే సాహసం చేయరు. ఈ నేపధ్యంలో మ‌హేష్‌బాబు కోసం వంశీ పైడిప‌ల్లి ఓ క‌థ‌ను రెడి చేసి పట్టాలు ఎక్కించే ప్రయత్నం చేసారు. అయితే బడ్జెట్ ఎక్కువగా ఉండటం, స్క్రిప్టు సంపూర్తిగా లేదనిపించటంతో మహేష్ నో చెప్పారు. మరి ఇప్పుడు ఎవరితో ఫైనలైజ్ చేసి ముందుకు వెళ్తారు అని అంతా ఆసక్తిగా ఎదురుచూసారు.

ఈలోగా గీతా గోవిందం వంటి సూపర్ హిట్ ఇచ్చిన పరుసరామ్ కథ విని,నచ్చి డవలప్ చేయమన్నారు. భీమిలిలో స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేసి పెట్టారు. దాంతో పరుసరామ్ స‌రిలేరు నీకెవ్వ‌రు రిలీజ్ కాగానే మహేష్ ని కలిసి కథ వినిపించారు. అయితే తన స్టార్ ఇమేజ్ కు తగ్గ కాదేమో అని మహేష్ అనుమాన పడ్డారు. దాంతో స్క్రిప్టులో మరిన్ని మార్పులు చేసి కలవమన్నారు. మరో ప్రక్క ఈ లోగా భీష్మ సినిమా రిలీజైంది. ఆ చిత్రం చూసిన మహేష్ మనసు పడి, పిలిపించారు. దాంతో మళ్లీ డైలమో మొదలైంది. అయితే మహేష్ చివరకు ఓ క్లారిటీకి వచ్చారు. తన తదుపరి సినిమాని ఓకే చేసి పట్టాలు ఎక్కించటానికి రెడీ అయ్యారు.


అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించటానికి రెండు మూడు పేర్లు వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్స్ లో ఒకరిని త్వరలోనే ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది.  'గీత గోవిందం'తో  హిట్ కొట్టిన పరశురామ్ చేస్తున్న సినిమా కావడంతో, సహజంగానే ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరగనున్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాతో, మహేష్  బాబుకి మరో భారీ హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం రకరకాలుగా ఆలోచించి, తక్కువ బడ్జెట్ లో రూపొందే ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పరుశరామ్ నే డైరక్టర్ గా ఎంపిక చేసుకున్నారు. మైత్రీ మూవిస్, 14 రీల్స్ ప్లస్ కలిసి ఈ ప్రాజెక్టుని హ్యాండిల్ చేస్తారు. మహేష్ బాబు జిఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్టుని హ్యాండిల్ చేస్తుంది.

 మైత్రీ మూవీస్ వారు ప్రొడక్షన్ మొత్తం చూసుకుంటుంది. 14 రీల్స్ ప్లస్ వారు పెట్టుబడి పెట్టి లాభాల్లో షేర్ తీసుకుంటారు. మహేష్ కు ఈ సినిమా నిమిత్తం భారీగా రెమ్యునేషన్ అందనుంది. మే నెలలో ఈ సినిమాకు సంభందించి అఫీషియల్ ఎనౌన్సమెంట్ వస్తుంది. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా 2021 సమ్మర్ లో రిలీజ్ అవుతుంది.