Asianet News TeluguAsianet News Telugu

నాగ్ ‘వైల్డ్ డాగ్’ రివ్యూ


నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వైల్డ్ డాగ్”. అహిషోర్ సాలొమోన్ దర్శకత్వంలో ఇండియాలోనే బిగ్గెస్ట్ అండర్ కవర్ ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎంత మేర ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం.
 

Nagarjuna wild dog movie review jsp
Author
Hyderabad, First Published Apr 2, 2021, 4:51 PM IST

టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చి మన తెలుగులో వర్కవుట్ అయినవి తక్కువే. దాంతో గబుక్కున హీరోలు అలాంటి సబ్జెక్టులు జోలికి పోరు. కానీ నాగ్ ది మొదటి నుంచీ ప్రయోగాల బాటే. కొత్త కథలను, కొత్త డైరక్టర్స్ ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో అప్పుడెప్పుడో  ఆయ‌నే చేసిన ‘గ‌గ‌నం’ టైప్ పాటలు, కామెడీలు లేని ప్యూర్ యాక్షన్ సినిమాని మరోసారి ఆవిష్కరించాలనుకున్నారు. ఈ సినిమాకు మంచి ఓటీటి ఆఫర్ వచ్చినా వద్దనుకున్నారు. మరి నిజంగానే ఆ స్దాయిలో సినిమా ఉందా... ‘వైల్డ్ డాగ్’ ప్రేక్షకులకు నచ్చుతుందా? ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటి... వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.  

కథేంటి

 2006 లో హైదరాబాద్ లో జరిగిన గోకుల్ ఛాట్ ప్రేలుళ్లు నుంచి, ఆ తర్వాత కాలంలో జరిగిన మరిన్ని బాంబు పేలుళ్ల సంఘటనలు బేస్ చేసుకుని అల్లిన కథ ఇది.  నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌.ఐ.ఎ)లో  ఏసీపీ విజ‌య్ వ‌ర్మ (నాగార్జున‌) బెస్ట్ ఆఫీసర్. కౌంటర్ టెర్రరిస్ట్ ఎటాక్ లు చేస్తూంటాడు. టెర్రరిస్ట్ లను పట్టుకునే కన్నా వారిని చంపటానికే ఇష్టపడే అతనికి వైల్డ్ డాగ్ అని పేరు.  పూనే జాన్ బేకరీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లు వెనక ఉన్న కుట్రదారులని, ఉగ్రవాదులను పట్టుకోవటానికి డిపార్టమెంట్ అతని సాయిం కోరుతుంది.  రంగంలోకి దిగిన విజయ్ వర్మ అతి తక్కువ టైమ్ లోనే ఈ బ్లాస్ట్ లు వెనక.. ఇండియ‌న్ ముజాహిదీన్‌కి చెందిన ఖలీద్ భక్తల్ మాస్టర్ మైండ్ ఉందని కనిపెడతాడు. ముంబైలో ఉన్న అతన్ని పట్టుకోవటానికి ప్లాన్ చేస్తాడు. కానీ లాస్ట్ మినిట్ లో ఆ  ప్లాన్ ఫెయిలై..తప్పించుకున్న ఖలీద్..నేపాల్ పారిపోతాడు. విజయ్ వర్మ కూడా తన టీమ్ తో కలిసి అక్కడికి వెళ్లతాడు. నేపాల్ లో ఖలీద్ పట్టుకుని, ఇండియా తీసుకురావటానికి విజయ్ వర్మ ఏం ప్లాన్ చేసాడు..తప్పించుకోవటానికి ఖలీద్ ఎంచుకున్న మార్గం ఏమిటి...ఎవరు సక్సెస్ అయ్యారు...విజయ్ వర్మ జీవితంలో ఉన్న విషాదం ఏమిటి..ఈ కథలో సమామీ ఖేర్,దియా మీర్జా పాత్రలేమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 
ఎనాలసిస్...

నిజ జీవిత  సంఘటనలను అదీ టెర్రరిస్ట్ ఎటాక్ లకు సంభందించిన విషయాలను బోర్ కొట్టకుండా తెరకెక్కించటం అంట మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ సినిమాలో చూపెట్టిన చాలా విషయాలు మనం పేపర్లో చదివి, ఛానెల్స్ ద్వారా విన్నవే. హెడ్ లైన్స్ గా మనకు గుర్తు ఉన్నవే. అలాగే ఆ సంఘటనలు జరిగి చాలా టైమ్ అయ్యింది. గత కొన్నేళ్లుగా మనదేశంలో ఆ స్దాయి టెర్రరిస్ట్ ఎటాక్ లు లేవు. దాంతో ఆ డాట్స్ ని కనెక్ట్ చేస్తూ, మనల్ని ఎమోషనల్ గా కనెక్ట్ చేయటం...ఈ సినిమాలో నాగార్జున టెర్రరిస్ట్ లను పట్టుకోవటం లాంటి  పెద్ద టాస్క్. అలాగే రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకోవటం వల్లనో..మరేమో కానీ ట్విస్ట్ లు, టర్న్ లు పెద్ద ఇంట్రస్టింగ్ గా లేవు. నాగ్ ని వైల్డ్ డాగ్ అన్నారే కానీ అదేమీ  కొత్త క్యారక్టరైజేషన్ కాదు..అబ్ తక్ చప్పన్ లాంటి సినిమాల్లో చూసేసిందే. ఆ తర్వాత ఆ సినిమాను అనుసరిస్తూ..అనుకరిస్తూ వచ్చిన చాలా సినిమాల్లో ఉంది. మరి ఇంక ఈ సినిమాలో ఏముంది అంటే.. ఇంట్రస్టింగ్ క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ సైతం మనకు హాలీవుడ్ చిత్రం‘Argo’ నుంచి తీసుకున్నట్లున్నారు. ఆ సినిమానే గుర్తు వస్తుంది.  ఈ సినిమాకు రైటింగ్ పూర్ అనిపిస్తుంది. స్పై థ్రిల్లర్ జానర్ లో సాగిన ఈ సినిమా బ్లాస్ట్ లు జరిగిన తర్వాత సంఘటనల చుట్టూ తిరిగటంతో , బ్లాస్ట్ లను ఆపటం వంటివాటి చుట్టూ తిరగక పోవటంతో ఇంట్రస్టింగ్ స్క్రిప్టుగా తయారు కాలేదు. కాకపోతే ఎంచుకన్న కథాంశమే అలాంటిదే కాబట్టి చేయగలిగిందీ ఏమీ లేదు. ఇక ఈ సినిమాకు ప్లస్ ఏమిటీ అంటే...ఎక్కువ టైమ్ తీసుకోకుండా కోర్  పాయింట్ లోకి వచ్చేయటం. సాధారణంగా మనవాళ్లు ఇంట్రవెల్ దాకా మెయిన్  ప్లాట్ లోకి రారు. కానీ ఈ సినిమాలో మొదలైన కాసేపట్లోకి కథలోకి వెళ్లిపోయారు. అయితే ఇంత సినిమాలోనూ ఎమోషన్స్ కు చోటు లేదు.కాబట్టి పర్శనల్ లెవిల్ లో కనెక్ట్ అవటం కష్టమే అనిపిస్తుంది. థ్రిల్ కథలో పెట్టుకోవటానికి బోలెడు స్పేస్ ఉంది కానీ ఎందుకో వదిలేసారు. 
 
దర్శకత్వం,మిగతా విభాగాలు

 ర‌చ‌యిత నుంచి డైరక్టర్ గా ప్రమోట్ అయిన  అహిషోర్ సాల్మ‌న్ తనలోని రచయితకు ఎక్కువ అవకాసం ఇవ్వలేదు. అలాగని డైరక్టర్ గానూ మేకింగ్ పరంగా అద్బుతం చేయలేదు.  అయితే రొటీన్ కంటెంట్ తీసుకోకుండా తొలి సినిమాకు కొత్తగా వెళ్లాలన్న ఆలోచన మెచ్చుకోదగినదే. అలాగే టిపికల్ కమర్షిల్ ఎలిమెంట్స్ కు ప్రాధాన్యత ఇవ్వలేదు. యాక్షన్ సీక్వెన్స్ లు బాగా చిత్రీకరించారు.  కొన్నిచోట్ల‌… వైల్డ్ డాగ్ బాగుందనిపించినా, టోటల్ గా అబ్బే అనిపిస్తుంది. ఇలాంటి హాలీవుడ్ చిత్రాలు చాలా వచ్చేయటంతో ...అవి చూసిన వాళ్లకు ఇంకాస్త బాగా తీయచ్చు కదా అనిపిస్తుంది. 
 
ఇక వైల్డ్ డాగ్ గా నాగార్జున...చాలా రిలాక్స్ గా కనిపించారు. పెద్ద యాక్టీవ్ గా లేరు. మాట్లాడితే చాలు...`మీరు కానీయండి బాయ్స్‌..` అంటూ టీమ్ కు పని అప్పగించి..కారులో రిలాక్స్ అయ్యిపోయారు. ఆయన రిలాక్స్ అయితే ప్రేక్షకులు రిలాక్స్ అవుతారనే విషయం మర్చిపోయారు. ఇక సెంకాఢ్ లో కనపడే స‌యామీఖేర్ బాగా చేసింది. అయితే ఆమె చాలా సీరియస్ క్యారక్టరైజేషన్. 
   
టెక్నికల్ గా చూస్తే..ముందుగా మెచ్చుకోవాల్సింది త‌మ‌న్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ని . అయితే కొన్ని చోట్ల గన్ సౌండ్స్ మాత్రమే వినిపించాయి. ఇక కెమెరా వర్క్ కూడా బాగుంది.  సినిమా మూడ్ కి అనుగుణంగా కెమెరా కదిలింది. ఎడిటింగ్ బాగానే షార్ప్ గా చేసారు.   ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. డైలాగులు సీన్స్ కు తగ్గట్లే సాగాయి.

ఫైనల్ థాట్

ఓటీటి సినిమా పెద్ద తెరపై చూసినట్లు ఉంది. 
Ratign:2.5
--సూర్య ప్రకాష్ జోశ్యుల

ఎవరెవరు..
సంస్థ: మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌; 
నటీనటులు: నాగార్జున, దియా మీర్జా, సయామీఖేర్‌, అతుల్‌ కులకర్ణి, అలీ రెజా, అవిజిత్‌ దత్‌ తదితరులు;
 సంగీతం: ఎస్‌.తమన్‌;
 సినిమాటోగ్రఫీ: షానెల్‌ డియో; 
ఎడిటింగ్‌: శర్వణ్‌ కత్తికనేని; 
సంభాషణలు: కిరణ్‌ కుమార్‌;
 నిర్మాత: నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి; 
రచన, దర్శకత్వం: అహిషోర్‌ సాల్మన్‌; 
విడుదల: 02-04-2021
 

Follow Us:
Download App:
  • android
  • ios