కరోనా టెస్ట్ చేయించుకున్న నాగ్, రిజల్ట్‌ ఏంటీ?

చిరంజీవి సైతం గత నాలుగైదు రోజులుగా తనను నేరుగా కలిసిన వారు కోవిడ్ టెస్టులకు వెళ్లాలని సూచించారు. ఆయనను కలిసిన వ్యక్తులు కరోనా నిర్ధారణ టెస్టులకు వెళితే ముందుగానే ప్రమాదం రాకుండా కరోనా బారి నుంచి బయటపడవచ్చు. 

Nagarjuna tests negative for COVID-19 jsp

మెగాస్టార్ చిరంజీవి రెండు రోజుల క్రితం(సోమ‌వారం) తనకు క‌రోనా వైన‌స్ సోకిందంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇటీవల ఆయన్ను ఎవరైతే కలిశారో వారు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది.ముఖ్యంగా చిరంజీవి నాలుగు రోజుల క్రితం రఘు కుంచె కూతురు వివాహంలో పాల్గొన్నాడు.అలాగే  గత శనివారం నాడు మెగాస్టార్ చిరంజీవి, బిగ్ బాస్ తెలుగు 4 హోస్ట్ నాగార్జున తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అయితే ఆ సందర్భంగా మాస్క్ లేకుండానే ఈ ముగ్గురు ప్రముఖులు కనిపించారు.
  
ఈ నేప‌థ్యంలో చిరంజీవికు కరోనా  విష‌యం తెలిసిన వెంట‌నే నాగార్జున క‌రోనా టెస్ట్ చేయించుకున్నార‌ట‌. ఈ టెస్టులో నాగ్‌కి నెగెటివ్ వ‌చ్చిన‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీంతో బిగ్ బాస్ తెలుగు 4 నిర్వాహకులు, నాగ్ అభిమాన‌లు ఊపిరి పీల్చుకుంటున్నారు.  ప్ర‌స్తుతం నాగ్ హోమ్ ఐసోలేష‌న్‌లో వుంటున్నారు. 

అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కింగ్ నాగార్జున అంద‌రి కంటే ముందు బిగ్‌బాస్ ప్రోమో కోసం సెట్‌లో కాలుపెట్టారు. అప్ప‌టి నుంచి బిగ్‌బాస్ కోసం వ‌ర్క్ చేస్తూనే త‌ను న‌టిస్తున్న `వైల్డ్ డాగ్‌` షూటింగ్‌ ను మనాలీలో పూర్తి చేసుకుని వచ్చారు. అలాగే నాగార్జున వెంటనే బ్రహ్మాస్త్ర షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వాల్సి ఉండగా మహమ్మారి కారణంగా మరోసారి నాగ్‌ పూర్తిగా హోం క్వారెంటైన్‌ అయ్యారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios