బిగ్ బాస్ హౌస్ లో ప్రతి ఒక్క కంటెస్టెంట్ తో కింగ్ నాగార్జున మాట్లాడుతున్నారు. గత వారం రోజులుగా వారి వారి ప్రవర్తనలోని మంచి చెడులను నాగార్జున తెలియజేస్తున్నారు. హౌస్ లోని కొందరు ఇంటి సభ్యుల ప్రవర్తనపై కింగ్ నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. ఈ లిస్ట్ లో నోయల్, అమ్మ రాజశేఖర్, సూర్య కిరణ్ ఉన్నారు. 

నోయల్ ఓవర్ థింకింగ్ ఎక్కువైంది అన్న నాగార్జున, అనవసరమైన విషయాల్లో ఎందుకు తలా దూర్చుతున్నావ్ అన్నారు. అలాగే కరాటే కల్యాణికి కూడా కింగ్ నాగార్జున చిన్న క్లాస్ పీకారు. ఇతరుల గురించి మోనాల్ కి కరాటే కళ్యాణి చెప్పిన చాడీలను నాగార్జున ప్రస్తావించారు. అక్కడ జరిగింది కాకుండా  కొంత నీ సొంత ఉద్దేశాలు ఎందుకు కలిపి చెవుతున్నావ్ అన్నారు. 

అలాగే ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెవుతున్నా అన్నారు. దీనికి కరాటే కళ్యాణ్ అది ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదని. హరికథలు చెప్పిన అలవాటు వలన ఏదైనా కొంచెం విడమర్చి చెప్పడం వలన జరిగిన పొరపాటు అయ్యి వుండొచ్చు. ఇకపైన అలా జరిగి ఉండొచ్చు అన్నారు. కొంచెం కరాటే కళ్యాణి కవర్ చేసుకోవడానికి ట్రై చేసినా దొరికి పోయినట్లు అనిపించింది.