ఈ వార్త నిజమనే అంటున్నాయి సినీ వర్గాలు. లేకపోతే మహేష్, వంశీ పైడిపల్లి ప్రాజెక్టు ఆగిపోకుండా ముందుకు వెళ్లేదంటున్నారు. అదేంటి నాగార్జున కు మహేష్ కొత్త సినిమాకు లింకేంటి..ఆయనేమీ వేరే వారి సినిమాల విషయంలో జోక్యం చేసుకోడు కదా..ఇప్పుడేంటి కొత్తగా అంటే. నాగ్ ఏమీ మారలేదు. ఆయనేమీ మహేష్ సినిమా విషయంలో వేలు పెట్టలేదు. అయితే నాగ్ ..వైల్డ్ డాగ్ సినిమా ఓకే చేయటమే వంశీ పైడిపల్లి సినిమాకు ముప్పు తెచ్చిపెట్టిందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. అదెలా అంటే కాస్త లోతుకు వెళ్లాల్సిందే.

మహేష్ తో మహర్షి చేసే సమయంలోనే ఓ లైన్ చెప్పి ఇంప్రెస్ చేసాడు వంశీ పైడిపల్లి. మహేష్ ...ఆ లైన్ ని డవలప్ చేసి తీసుకొస్తే సినిమా చేసేద్దాం అన్నారు. ఈ లోగా నేను సరిలేరు నీకెవ్వరూ సినిమా ఫినిష్ చేసుకొస్తాను అని మహేష్ చెప్పారు. దాంతో వంశీ పైడిపల్లి తన స్క్రిప్టు టీమ్ సోలమన్, హరి లతో కలిసి డిస్కషన్ మొదలెట్టారు. ఓ కొలిక్కి వచ్చిందనుకున్నాక, మహేష్ కు వెళ్లి వంశీ నేరేట్ చేసారు. అయితే మహేష్ సంతృప్తి చెందలేరు. మహర్షి లా కాకుండా ఈ సారి సాలిడ్ హిట్ కొట్టాలి అంటే స్క్రిప్టు ఇంకొంచెం టైట్ గా ఉండాలి అని చెప్పి వర్క్ చేయమన్నాడు. అయితే ఈ లోగా అనుకోని దెబ్బ పడింది. అదే వైల్డ్ డాగ్ సినిమా ఓకే అయ్యింది.

ఊపిరి సినిమాకు సైతం సోలమన్ పని చేసారు. ఆ సమయంలో నాగ్ తో ఏర్పడిన పరిచయంతో ఓ కథ చెప్పి ఒప్పించుకున్నారు. దాంతో నాగ్ వెంటనే ఈ ప్రాజెక్టు చేసేద్దాం అన్నారు. షూటింగ్ స్టార్టైంది. వంశీ పైడిపల్లికి బెస్టాఫ్ లక్ చెప్పటం తప్ప వేరే దారి ఏమీ లేదు. అలా తన స్క్రిప్టుకు రైట్ హ్యాండ్ లా ఉండాల్సిన సోలమన్  తన సొంత సినిమాకోసం వెళ్లిపోవటంతో కేవలం తను కొద్ది మంది తన స్క్రిప్టు వర్క్ చేసే సన్నిహితులతో మాత్రమే కూర్చున్నారు. ఈసారి స్క్రిప్టు అనుకున్నట్లుగా రాలేదు. మహేష్ ...నేను వేరే డైరక్టర్ తో ముందుకు వెళ్తున్నా..ఈ లోగా మరింత షార్ప్ గా స్క్రిప్టు చేయండి..టైమ్ తీసుకోండి అని అన్నారు. సూపర్ స్టార్ ఖాళీగా ఉండలేడుగా. దాంతో వంశీ పైడిపల్లి, మహేష్ సినిమా ఆగిపోయినట్లైంది.