నాగ్ నుండి పాతిక లక్షల చెక్.. ఎవరికంటే..?

nagarjuna paid 25 lakhs advance to rahul raveendra
Highlights

రాహుల్ రవీంద్రన్ ఇప్పటివరకు అందరికి నటుడిగానే తెలుసు. కానీ 'చిలసౌ' సినిమాతో దర్శకుడిగా మారి తన సత్తా చాటుకున్నాడు . 

రాహుల్ రవీంద్రన్ ఇప్పటివరకు అందరికి నటుడిగానే తెలుసు. కానీ 'చిలసౌ' సినిమాతో దర్శకుడిగా మారి తన సత్తా చాటుకున్నాడు . ఎంతోకాలంగా హిట్ కోసం చూస్తోన్న నాగార్జున మేనల్లుడు సుశాంత్ కి ఈ సినిమాతో మంచి విజయం దక్కింది. అయితే రిలీజ్ కు ముందు ఈ సినిమా చూసిన నాగచైతన్య తన తండ్రి నాగార్జునను కూడా చూడమని కోరారు. నాగ్ కు ఈ సినిమా తెగ నచ్చడంతో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైనే విడుదల చేశారు.

అంతేకాదు రాహుల్ రవీంద్రన్ తో మరో సినిమా కూడా చేయాలని అనుకున్నారు. అయితే తాజాగా దీనికోసం రాహుల్ కి పాతిక లక్షల రూపాయలు అడ్వాన్స్ గా అందినట్లు సమాచారం. దర్శకుడిగా రాహుల్ 'చిలసౌ' సినిమాకు అందుకున్న రెమ్యునరేషన్ కంటే రెండో సినిమా కోసం అందుకున్న ఆడ్వాన్సే ఎక్కువట. మొత్తానికి ఒక్క సినిమాతో రాహుల్ మంచి పేరు దక్కించుకోవడంతో పాటు పెద్ద బ్యానర్లలో అవకాశాలు రావడం విశేషం.

ఇప్పటికే రాహుల్ రవీంద్రన్ రెండు, మూడు లైన్లు అనుకుంటున్నాడట. వాటిని డెవెలప్ చేసి నాగార్జునకు వినిపిస్తే.. తమ ఫ్యామిలీలో హీరోతోనే సినిమా చేయాలనుకుంటున్నారు. మరి ఈసారి రాహుల్ ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి! 

loader