ప్రస్తుతం నాగార్జున క్లిష్టమైన పరిస్థితిని ఫేస్‌ చేస్తున్నారు. నెక్ట్స్ ఎవరితో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ పేథ్యంలో ఓ క్రేజీ డైరెక్టర్‌ పేరు తెరపైకి వచ్చింది. 

యంగ్‌ హీరోలకు, ప్రభాస్‌, ఎన్టీఆర్‌, బన్నీ లాంటి స్టార్స్ కి కథలు రావడం ఈజీ. డైరెక్టర్ల టార్గెట్‌ అంతా వారిపైనే ఉంటుంది. కానీ సీనియర్‌ హీరోలకు మాత్రం ఒకరకమైన ఇది గడ్డు ఫేస్‌ అనే చెప్పాలి. ఏవీ ఆదరణ పొందుతాయి, ఎలాంటివి ఆడియెన్స్ యాక్సెప్ట్ చేస్తారనేది ఊహించడం కష్టం. పైగా ఈ ఏజ్‌కి సరిపడ కథలు తయారు చేయడంకూడా సవాల్‌తో కూడినదే. చాలా తక్కువగా వస్తుంటాయి.వాటిలో బెస్ట్ సెలక్ట్ చేసుకోవడం ఇంకా పెద్ద సవాల్‌. 

ప్రస్తుతం నాగార్జున ఇలాంటి క్లిష్టమైన పరిస్థితినే ఫేస్‌ చేస్తున్నారు. ఇటీవల నాగార్జున నటించిన `ది ఘోస్ట్` చిత్రం పరాజయం చెందింది. అంతకు ముందు `బంగార్రాజు` సైతం ఓ మోస్తారుగానే ఆడింది, ఆ క్రెడిట్‌ చైతూ తీసుకెళ్లాడు. మరోవైపు `వైల్డ్ డాగ్‌` థియేటర్లో ఆడలేదు, ఓటీటీలో బాగానే చూశారు. `మన్మథుడు 2` డిజాస్టర్‌ అయ్యింది. `సోగ్గాడే చిన్ని నాయన` తర్వాత బ్లాక్‌ బస్టర్‌ చెప్పుకునే హిట్‌ పడలేదు. ఆ స్ట్రగులింగ్‌ ఇంకా నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో స్క్రిప్ట్ లను ఎంపిక చేయడం ఇప్పుడు పెద్ద టాస్క్ లా మారింది. 

ఇటీవలే రైటర్‌ ప్రసన్నకుమార్‌ బెజవాడని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమాని చేయాలనుకున్నారు నాగ్‌. కానీ స్క్రిప్ట్ విషయంలో సాటిస్పై కాలేదు, పైగా అది మలయాళ చిత్రానికి రీమేక్‌ అని, ఆ రైట్స్ దొరక్కపోవడంతో ఈ కథని పక్కన పెట్టారు. మరోవైపు ఓ సినిమాటోగ్రాఫర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ గ్యాంగ్‌ స్టర్ మూవీ అనుకున్నారట. కానీ అదికూడా పక్కన పెట్టారట నాగార్జున. ఇప్పుడు కొత్త దర్శకులతో కథలు వింటున్నారు. ఈ క్రమంలో ఓ డైరెక్టర్‌కి కమిట్‌ అయినట్టు సమాచారం. 

`RX100`ఫేమ్‌ అజయ్‌ భూపతితో నాగార్జున సినిమా చేయబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్యచర్చలు జరుగుతున్నాయట. ప్రస్తుతం అజయ్‌ భూపతి `మంగళవారం` అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో `ఆర్‌ఎక్స్ 100` ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయిక. లేడీ ఓరియెంటెడ్‌గా ఈసినిమా రాబోతుందట. రియలిస్టిక్ కథతో, క్రైమ్‌ థ్రిల్లర్ గా , బోల్డ్ కంటెంట్‌తో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ఇది సెప్టెంబర్‌లో విడుదల కానుంది. అయితే ఇటీవలే అజయ్‌ భూపతి నాగ్‌కి కథ వినిపించారట. రియలిస్టిక్‌ కథతో, యాక్షన్‌ థ్రిల్లర్‌ గా ఉండే కథని నెరేట్‌ చేయగా, నాగ్‌ ఇంప్రెస్‌ అయ్యారట. అందుకే దీనిపై వర్క్ చేస్తున్నారట. నాగ్‌కి నచ్చేలా అజయ్‌ చేస్తే ఈ సినిమా ఫైనల్‌ అయ్యే అవకాశం ఉంది. 

అయితే నాగార్జున కూడా ఇక బోల్డ్ గా దిగాలని ఫిక్స్ అవుతున్నారని టాక్‌. అందులో భాగంగానే అజయ్‌ భూపతిలాంటి డైరెక్టర్‌తో సినిమా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఓ రకంగా ఆయన బోల్డ్ గా నిర్ణయం తీసుకుంటున్నారని సమాచారం. ఇదే సెట్‌ అయితే నాగ్‌ని చాలా రోజుల తర్వాత ఓ కొత్త అవతార్‌లో, ఇటీవల సినిమాల్లో వర్కౌట్‌ అవుతున్న రా, రస్టిక్‌ కంటెంట్‌తో నాగార్జున సినిమా చేయబోతున్నారని సమాచారం. మరి ఇది ఎంత వరకు సెట్‌ అవుతుందో, నాగ్‌ ఒప్పుకుంటాడా? అజయ్ ఒప్పిస్తాడా? అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. అన్నీ ఓకే అయితే దీన్ని అన్నపూర్ణ స్టూడియోలోనే నిర్మించే అవకాశం ఉంది.