Asianet News TeluguAsianet News Telugu

నాగార్జున, నాని `జెర్సీ`లకు దాదాసాహెబ్‌ ఫాల్కే సౌత్‌ పురస్కారాలు..

భారత సినిమా పితామహుడు దాదాసాహెబ్‌ ఫాల్కే కుటుంబం ఆయన పేరుతో నెలకొల్పిన దాదాసాహెబ్‌ ఫాల్కే సౌత్‌ పురస్కారం నాగార్జునకి, `జెర్సీ` చిత్రానికి దక్కాయి. మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అవార్డు అక్కినేని నాగార్జునకు దక్కింది. ఉత్తమ చిత్రంగా `జెర్సీ`  ఎంపికైంది. 

nagarjuna and nani jersy movie selected for dada saheb phalke south award arj
Author
Hyderabad, First Published Jan 2, 2021, 8:19 AM IST

కింగ్‌ నాగార్జునకి అరుదైన అవార్డు దక్కింది. అలాగే నేచురల్‌ స్టార్‌ నాని నటించిన `జెర్సీ` మూవీకి గొప్ప గౌరవం దక్కింది. భారత సినిమా పితామహుడు దాదాసాహెబ్‌ ఫాల్కే కుటుంబం ఆయన పేరుతో నెలకొల్పిన దాదాసాహెబ్‌ ఫాల్కే సౌత్‌ పురస్కారం నాగార్జునకి, `జెర్సీ` చిత్రానికి దక్కాయి. మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అవార్డు అక్కినేని నాగార్జునకు దక్కింది. ఉత్తమ చిత్రంగా `జెర్సీ`  ఎంపికైంది. 

మరోవైపు కామెడీ థ్రిల్లర్‌ `ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ` చిత్రంలో హీరోగా నటించిన నవీన్‌ పొలిశెట్టి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. `డియర్‌ కామ్రేడ్‌`లో లిల్లీగా మెస్మరైజ్‌ చేసిన రష్మిక మందన్నా ఉత్తమ నటిగా ఎంపికైంది.  పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌తో భారీ యాక్షన్‌ చిత్రాన్ని రూపొందించిన సుజిత్‌ ఉత్తమ దర్శకుడిగా అవార్డు దక్కించుకున్నారు. `అల వైకుంఠపురములో` చిత్రానికి అద్భుతమైన మ్యూజిల్‌ ఆల్బమ్‌ అందించిన ఎస్‌.ఎస్‌.తమన్‌ ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్ గా ఎంపికయ్యారు. 

కేంద్ర ప్రభుత్వం గత 50 ఏళ్లుగా `దాదాసాహెబ్‌ ఫాల్కే` పేరుతో దేశంలోనే అత్యున్నత పురస్కారాన్ని అందిస్తుంది. తాజాగా ఇచ్చే అవార్డులను ఫాల్కే కుటుంబానికి చెందిన ప్రైవేట్‌ సంస్థ అందిస్తుంది. 2019లో విడుదలైన చిత్రాలకు 2020లో అందిస్తారు. అయితే ఇందులో `అలవైకుంఠపురములో` చిత్రానికి అవార్డు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.  2020లో విడుదలైన ‘అల వైకుంఠపురములో’ సినిమాకు ఎలా ఇస్తారని కొంత మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios