2021కి స్వాగతం పలికారు కింగ్‌ నాగార్జున, నందమూరి బాలకృష్ణ. గతం ఏడాది ఇచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగాలని చెప్పారు. ఈ మేరకు నాగార్జున భార్య అమలతో కలిసి ఫోటోని షేర్‌ చేయగా, బాలకృష్ణ ఫేస్‌బుక్‌లో తన విషెస్‌ తెలిపారు. 

నాగార్జున చెబుతూ, `అందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు. కొత్త దశాబ్దం, అందమైన కొత్త ప్రపంచం. అందరికి మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుకుంటున్నా` అని తెలిపారు. 

`న్యూ ఇయర్‌ అనేది పాత ఏడాది వీడ్కోలు చెప్పడానికి, రాబోయే సంవత్సరానికి స్వాగతించే సమయం. గత జ్ఞాపకాలను మర్చిపోయి, ఉపయోగపడని వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దాన్ని మర్చిపోయి మన్నించుకుందాం. ఈ ఏడాది మీ జీవితంలో కొత్త ఆనందం, కొత్త లక్ష్యాలు, కొత్త విజయాలు, చాలా కొత్త ప్రేరణలను తెస్తుంది. ప్రతి ఒక్కిరిక మంచి ఆరోగ్యం, ఎలాంటి ఒత్తిడి లేని ఏడాది కావాలని కోరుకుంటూ 2021కి స్వాగతం చెబుతూ, అందరికి న్యూ ఇయర్‌ విషెస్‌` అని తెలిపారు బాలకృష్ణ. 

https://www.facebook.com/NandamuriBalakrishna/posts/3814505511934953

వీరితోపాటు పలు నిర్మాణ సంస్థలు సినీ అభిమానులకు న్యూ ఇయర్‌ విషెస్‌ తెలిపాయి.