ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కమిటైన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ కథపై ఇప్పటికే అనేక రూమర్స్  పరిశ్రమలో చక్కర్లు కొడుతుండగా అధికారిక ప్రకటనలు ఐతే ఏమి లేవు. తాజాగా ఈ సినిమాలో ఓ యంగ్ హీరో కీ రోల్ పోషించబోతున్నాడనే వార్త బయిటకు వచ్చింది. కథను మలుపు తిప్పే పాత్ర అదని, అందుకోసం యంగ్ హీరో అన్వేషణ జరుగుతోందని అంటున్నారు. అయితే ఇలా వేరే హీరోలను తీసుకుని వచ్చి సినిమాలో పెట్టడం త్రివిక్రమ్ కు కొత్తేమీ కాదు.

అజ్ఞాతవాసి చిత్రంలో ఆది పినిశెట్టి  కీ రోల్ లో కనిపించారు. ఇక అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నవీన్ చంద్ర కీ రోల్ లో కనిపించారు. అల వైకుంఠపురములో చిత్రంలో సుశాంత్ కీ రోల్ లో కనిపించారు. ఇలా వరస పెట్టి తన సినిమాల్లో కీ రోల్స్ లో యంగ్ హీరోలకు అవకాసం ఇస్తూ వస్తున్నారు త్రివిక్రమ్. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నట్లు సమాచారం. మరి ఇంతకీ ఏ హీరోకు ఈ ఆఫర్ వెళ్లబోతోందీ అంటే ఈ సారి నాగ శౌర్యని అడగబోతున్నట్లు వినికిడి. 

ఇందులో కథకు అవసరమైన ఓ లవ్ స్టోరీ ఉందని, దానికి యంగ్ హీరో అవసరం అంటున్నారు. అయితే నాగశౌర్యని ఇంకా అడగలేదని, లౌక్ డౌన్ సడలించాక, షూటింగ్ టైమ్ ఫిక్స్ చేసుకున్నాక, నాగ శౌర్యని కదలించే అవకాసం ఉందని చెప్తున్నారు. నాగశౌర్య డేట్స్ ప్లాబ్లం అయితే మరొక యంగ్ హీరోకు ఈ ఆఫర్ అందుతుంది.  మరో ప్రక్క ఈ చిత్రంలో ఎన్టీఆర్ ని స్టైలిష్ బిజినెస్ టైకూన్ లా చుపిస్తాడనే వార్త బయిటకు వచ్చింది. 

 ప్రస్తుతం  ఎన్టీఆర్ ...రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు.  లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయింది.  లాక్ డౌన్ కు ముందే ఎన్టీఆర్ వెర్షన్ ను చాలా వరకు కంప్లీట్ చేశారు.  ఇటు రాజమౌళితో సినిమా చేస్తూనే మరోవైపు అరవింద సమేత వంటి బెస్ట్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు.  లాక్ డౌన్ లేకుంటే ఈ సినిమా మే లేదా జూన్ లో ప్రారంభం అయ్యి ఉండేది.  కానీ లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా సెప్టెంబర్ కు పోస్ట్ ఫోన్ అయ్యింది. 

 సెప్టెంబర్ నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది.  సమ్మర్ వరకు షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లేదా జూన్ కు సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.  ఇందులో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉన్నది.  బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ ను ఒక హీరోయిన్ గా తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.  మరో హీరోయిన్ గా శృతి హాసన్ ను తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇవన్నీ చూస్తూంటే ...త్రివిక్రమ్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం ఇదే అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.