యంగ్ హీరోల నాగ శౌర్యలో  చాలా కసి కనపడుతుంటుంది. కెరీల్ లో  డిఫరెంట్ పాత్రలు చేయాలని ఆశపడుతుంటాడు. అందుకోసం ఎంత కష్టాన్నైనా పడడానికి సిద్ధంగా వుంటాడు. ముఖ్యంగా క్యారెక్టర్ని బట్టి సిక్స్ ప్యాక్ వంటి బాడీ షేప్ తెచ్చుకోవడానికి ప్రస్తుతం అతను పడే శ్రమ అంతాఇంతా కాదు. ఎన్నో వర్కౌట్స్ తో పాటు కఠినమైన డైట్ కూడా ఫాలో అవుతున్నాడు.  

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ప్రస్తుతం నాగ శౌర్య ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో విలుకాడిగా తను నటిస్తున్నాడు. ఈ పాత్రలో ఎయిట్ ప్యాక్ (ఎనిమిది పలకల) బాడీ షేప్ తో కనిపిస్తాడు. ఇందుకోసం ఎన్నో వర్కౌట్స్ చేస్తూ.. స్ట్రిక్ట్ డైట్ అనుసరిస్తున్నాడు.

 #NS20 ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఫస్ట్ ఇండియన్ మూవీ అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి 'సుబ్రహ్మణ్యపురం' ఫేమ్ ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఇటీవలే హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు. అయితే ప్రస్తుతం షూట్ చేస్తున్న కీలకమైన సన్నివేశాల్లో శౌర్య షర్ట్ లేకుండా తన 8 ప్యాక్ బాడీని చూపించాల్సి ఉందంట. 

ఈ క్రమంలో దానిని తెరపై ప్రదర్శించడం కోసం గత ఐదు రోజులుగా నాగశౌర్య పచ్చి మంచినీళ్లు కూడా తాగడం లేదట. అంతెందుకు, లాలాజలాన్ని కూడా మింగకుండా ఆ బాడీ షేప్ ప్రదర్శించడం కోసం ఎంతో రిస్క్ చేస్తూ, శ్రమిస్తున్నాడని యూనిట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కేతికా శర్మ కథానాయికగా నటిస్తోంది.