తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమా షూటింగ్‌లు నెమ్మదిగా ప్రారంభమవుతున్నాయి. చిన్న సినిమాలు ఇప్పటికే షూటింగ్‌లు జరుపుకుంటుండగా, ఓ మోస్తారు నుంచి స్టార్‌ హీరోలు షూటింగ్‌ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే కరోనా భయాలను పటాపంచలు చేస్తూ మన్మథుడు నాగార్జున ఇటీవల `బిగ్‌బాస్‌ 4`ని, అలాగే ఆయన నటిస్తున్న `వైల్డ్ డాగ్‌` చిత్ర షూటింగ్‌ని ప్రారంభించి కొత్త పంథాకి తెరలేపారు. 

తాజాగా తండ్రి నాగార్జున స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాడు యువ సామ్రాట్‌ నాగచైతన్య. ఆయన నటిస్తున్న `లవ్‌ స్టోరి` షూటింగ్‌ని తిరిగి ప్రారంభించారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. 

కరోనా జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్‌ని జరుపుతున్నట్టు తెలిపారు. సెట్‌లో పదిహేను మంది వరకే ఉండేలా చూసుకుంటున్నామని, సోషల్‌ డిస్టెన్స్, మాస్క్ లు ధరించి షూటిగ్‌ జరుపుతున్నట్టు తెలిపారు. అంతేకాదు సింగిల్‌ షెడ్యూల్‌లో మిగిలిన చిత్రీకరణ మొత్తం కంప్లీట్‌ చేయనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా అన్ని రకాల ప్రభుత్వ గైడ్‌లైన్స్‌ ని  పాటిస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమాని సునీల్‌ నారంగ్‌, మాజీ ఎఫ్‌డీసీ ఛైర్మెన్‌ రామ్‌మోహన్‌రావు నిర్మిస్తున్నారు.