Asianet News TeluguAsianet News Telugu

నిర్మాతగా నాగచైతన్య..హీరో ఎవరంటే..

సొంతగా ప్రొడక్షన్ హౌస్ పెట్టి మీడియం బడ్జెట్ సినిమాలు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. చైతూ .. సమంత సొంత బ్యానర్లో తొలి హీరోగా రాజ్ తరుణ్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ ప్రాజెక్టుని ఫైనలైజ్ చేసారని త్వరలోనే షూటింగ్ కు వెళ్లబోతున్నట్లు చెప్తున్నారు.  మినిమం బడ్జెట్ లో తెరకెక్కించి సినిమాని హిట్ కొట్టాలని భావిస్తున్నారట.

Naga Chaitanya Trying His Luck As Producer
Author
Hyderabad, First Published May 5, 2020, 12:56 PM IST


ఇప్పుడు యంగ్ హీరోలంతా నిర్మాణం వైపు దృష్టి పెడుతున్నారు. తమ అనుభవాన్ని, పరిచయాలను,డబ్బుని ఇదే ఫీల్డ్ లో పెట్టుబడిగా పెడుతున్నారు. ఇప్పుడు అదే దారిలో నాగ చైతన్య సైతం ప్రయాణం పెట్టుకున్నాడు. ఆయన సొంతగా ప్రొడక్షన్ హౌస్ పెట్టి మీడియం బడ్జెట్ సినిమాలు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. చైతూ .. సమంత సొంత బ్యానర్లో తొలి హీరోగా రాజ్ తరుణ్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ ప్రాజెక్టుని ఫైనలైజ్ చేసారని త్వరలోనే షూటింగ్ కు వెళ్లబోతున్నట్లు చెప్తున్నారు.  మినిమం బడ్జెట్ లో తెరకెక్కించి సినిమాని హిట్ కొట్టాలని భావిస్తున్నారట.

 ఇక గతంలో రాజ్ తరుణ్ హీరోగా దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' సినిమాను తెరకెక్కించాడు. అయితే ఆ సినిమా వర్కవుట్ కాలేదు. ఆ దర్శకుడు తాజాగా చైతూ .. సమంతలకు ఒక కథను వినిపించాడట. ఆ కథను తమ బ్యానర్లో చేయడానికి చైతూ .. సమంత ఓకే చేసినట్టు తెలుస్తోంది. రాజ్ తరణ్ హీరోగా ఆ చిత్రం తెరకెక్కనుంది. అవికా గోర్ ని హీరోయిన్ గా ఎంపిక చేసారట. అన్నపూర్ణ స్టూడియోస్ లో స్టాఫ్ ఉండటంతో వాళ్లను ఈ ప్రొడక్షన్ కు ఉపయోగించబోతున్నారట. అలాగే అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ లో చదివిన స్టూడెంట్స్ కు కూడా ఈ సినిమాలో ఆఫర్ ఇస్తున్నట్లు సమాచారం.


గతంలో రాజ్ తరుణ్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో కింగ్ నాగార్జున ఓ రెండు సినిమాల్ని నిర్మించిన సంగతి తెలిసిందే. వాటిలో ఉయ్యాల జంపాల మంచి విజయం సాధించింది. ఆ వెంటనే రాజ్ తరుణ్ కి నాగ్ మరో ఆఫర్ ఇచ్చారు. అది కూడా అన్నపూర్ణ బ్యానర్ లో రంగుల రాట్నం టైటిల్ తో  సినిమా తీసి సంక్రాంతి బరిలో రిలీజ్ చేశారు. కానీ ఆ సినిమా ఆశించిన హిట్టు దక్కించుకోలేకపోయింది. అటుపై అన్నపూర్ణ బ్యానర్ లో రాజ్ తరణ్ కు ఛాన్సులు రాలేదు. ఇప్పుడు చైతు ద్వారా మరోసారి రాజ్ తరణ్ ..అన్నపూర్ణలో సినిమా చేస్తున్నారు. లాక్ డౌన్ తరువాత ఈ సినిమాకి సంబంధించిన పనులు మొదలుకానున్నట్టు చెబుతున్నారు. మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios