Asianet News TeluguAsianet News Telugu

‘థ్యాంక్యూ’ : మూడు పాత్రల్లో చైతూ,స్టోరీ లైన్ ఇదే?

నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ‘థాంక్యూ’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది.నాగచైతన్య మొదటి సారి హాకీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. 

Naga Chaitanya Three Characters In A Single Film
Author
Hyderabad, First Published Aug 31, 2021, 1:14 PM IST

నాగచైతన్య స్పీడు మీదున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో చేసిన ‘లవ్‌స్టోరీ’ రిలీజ్ కు రెడీగా ఉంది. ఇప్పుడు విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో చేస్తున్న  ‘థ్యాంక్యూ’ సినిమా కూడా కొంత ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ ఫినిష్ చేసారు.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ప్రమోషన్స్ ఇంకా మొదలెట్టలేదు.  బి.వి.ఎస్‌.రవి కథతో, దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓ విశేషముందని తెలుస్తోంది. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో చైతన్య మూడు పాత్రల్లో కనిపించబోతున్నారు.

ప్రేమమ్ లో స్కూల్ బోయ్ గా, కాలేజీ అబ్బాయిగా, చెఫ్ గా కనిపించిన చై, థాంక్యూలో మరో మూడు విభిన్న పాత్రల్లో అలరించబోతున్నాడట.  అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో చైతు ఓ స్టూడెంట్ లీడర్ గా, ఆ తర్వాత ఎన్నో పెద్ద కలలు ఉన్న యంగ్ మ్యాన్ గా, అన్ని సాధించిన మిడిల్ ఏజెడ్ పర్శన్ గా కనిపించి అలరించనున్నారట.

అలాగే నాగచైతన్య మొదటి సారి హాకీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. గతంలో ‘మజిలీ’ సినిమాలో క్రికెటర్ గా కనిపించి మెప్పించాడు చైతన్య.  ‘థాంక్యూ’ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తుంది. మరో ప్రక్క ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ప్రకారం ఎన్నారై బిజినెస్ మెన్ అయిన హీరో తన పుట్టుక మూలాలు ఇండియాలో ఉన్నాయని తెలుసుకుంటాడు. ఇండియాలో తన కుటుంబ సభ్యులను  వెదికేందుకు తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఆ సమయంలో అతడు ఎదుర్కొన్న అనుభవాల సారాంశమే ఈ సినిమా అంటున్నారు. 

విక్రమ్ కుమార్ కథలు అన్ని కూడా చాలా విభిన్నంగా స్క్రీన్ ప్లే బేస్డ్ గా సాగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అలానే ఉండబోతుందని అంటున్నారు.  నాగచైతన్య విక్రమ్ కుమార్ కాంబినేషన్లో గతంలో ‘మనం’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీకి ఓ బ్యూటీఫుల్ మెమొరీగా మిగిలిపోయింది.  మరో ప్రక్క  నాగ  చైతన్య - మోహనకృష్ణ ఇంద్రగంటి కలయికలో చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించబోతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios