Asianet News TeluguAsianet News Telugu

`బంగార్రాజు` బర్త్ డే పోస్టర్‌ని పంచుకున్న చైతూ.. నాగ్‌ రియాక్షన్‌ అదుర్స్ ..డెవిల్‌ ఈజ్‌ బ్యాక్‌

ఈ సినిమా ఐదేళ్ల క్రితం వచ్చి సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌ వస్తోంది. `బంగార్రాజు` పేరుతో రూపొందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఇందులో నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్కినేని హీరోల మల్టీస్టారర్‌గా చెప్పొచ్చు.

naga chaitanya shared bangaraju new poster nagarjuna says thanks to chai
Author
Hyderabad, First Published Aug 29, 2021, 1:36 PM IST

`సోగ్గాడే చిన్ని నయనా` చిత్రంతో కెరీర్‌ బెస్ట్ సక్సెస్‌ని అందుకున్నారు నాగార్జున. తన కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. కొత్త దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించగా, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి జంటగా కథానాయికలుగా నటించారు. ఈ సినిమా ఐదేళ్ల క్రితం వచ్చి సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌ వస్తోంది. `బంగార్రాజు` పేరుతో రూపొందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. 

ఇందులో నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్కినేని హీరోల మల్టీస్టారర్‌గా చెప్పొచ్చు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. గత సినిమాలోని గెటప్‌ని పోలీ ఉన్న నాగార్జున లుక్‌ ఆకట్టుకుంటుంది. `సోగ్గాడే చిన్ని నయనా` సినిమాని తలపిస్తుంది. ఈ పోస్టర్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. మరోవైపు నాగచైతన్య సైతం ఈ కొత్త లుక్‌ని విడుదల చేసి తండ్రి నాగ్‌కి బర్త్ డే విషెస్‌ తెలిపారు. 

`హ్యాపీ బర్త్ డే టూ మై కింగ్‌ నాగార్జున. మీతో స్క్రీన్‌ని పంచుకునేందుకు ఎంతో ఆతృతగా వెయిట్‌ చేస్తున్నా. ఎప్పటికీ మంచి ఆరోగ్యం, ఆనందం ఉండాలని కోరుకుంటున్నారు. మీతో ఉన్నందుకు ధన్యవాదాలు. చాలా ప్రేమతో` అని ఈ కొత్త లుక్‌ని పంచుకున్నారు చైతూ. `సోగ్గాడే చిన్ని నయనా` చిత్రంలోని నాగార్జున నటించిన `బంగార్రాజు` పాత్ర ఆధారంగానే సీక్వెల్‌కి టైటిల్‌ పెట్టడం విశేషం. ఇదిలా ఉంటే చైతూకి ధన్యవాదాలు తెలిపాడు నాగ్‌. `థ్యాంక్యూ రా చైతన్య. నీతో మరోసారి కలిసి పనిచేసేందుకు వేయిట్‌ చేస్తున్నా. ఇది చాలా పెద్ద ఫన్‌ మూవీ కాబోతుంది` అని నాగార్జున.

Follow Us:
Download App:
  • android
  • ios