నాగచైతన్య కొత్త సినిమాని ప్రకటించారు. తెలుగు, తమిళంలో చేయబోతున్న బైలింగ్వల్‌ సినిమాని అనౌన్స్ చేశారు. ముందుగా అనుకున్నట్టుగానే తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభుతో సినిమా చేయనున్నారు.

నాగచైతన్య(Naga Chaitanya) మరో కొత్త సినిమాని ప్రకటించారు. తమిళ్‌ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నారు. ఫస్ట్ టైమ్‌ ఓ బైలింగ్వల్‌ (Naga Chaitanya Bilingual) సినిమా చేస్తున్నారు తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు(Venkat Prabhu)తో ఆయన ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్ పై పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకట్‌ ప్రభు, నిర్మాతలు ప్రకటించారు. దర్శకుడు తన ఆనందాన్ని పంచుకున్నారు. బ్రదర్‌ నాగచైతన్యతో ఈ చిత్రం చేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇది నాగచైతన్య నటిస్తున్న 22వ చిత్రం కావడం విశేషం. 

ఇదిలా ఉంటే ఈ సినిమా ఫన్‌ రైడ్‌గా ఉంటుందని నిర్మాత శ్రీనివాసా చిట్టూరి వెల్లడించారు. ఈ బైలింగ్వల్‌ సినిమా చేయడం పట్ల తన హ్యాపీనెస్‌ని షేర్‌ చేసుకున్నారు. త్వరలోనే షూటింగ్‌ స్టార్ట్ కాబోతుందని వెల్లడించారు. అయితే ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించనుందని టాక్‌. గతంలో వీరిద్దరు కలిసి `ఒక లైలా కోసం` సినిమాలో నటించారు. ఆ తర్వాత మళ్లీ జోడీ కడుతుందని టాక్‌. 

Scroll to load tweet…

 ఇక ప్రస్తుతం నాగచైతన్య `థ్యాంక్యూ` చిత్రంలో నటిస్తున్నారు. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా. ఈసినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. మరోవైపు హిందీలోకి ఎంట్రీ ఇస్తూ అమీర్‌ ఖాన్‌తో `లాల్‌ సింగ్‌ చద్దా` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన ఆర్మీ పాత్రని పోషిస్తున్నారు. ఇది ఆగస్ట్ లో రాబోతుంది. మరోవైపు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలోనే `దూత` అనే వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారు నాగచైతన్య.

ఇలా క్రమ క్రమంగా నటుడిగా ఓపెన్‌ అవుతున్నారు. అటు హిందీ, ఇటు తమిళం, మరోవైపు డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చి వాహ్‌ అనిపిస్తున్నారు. మరోవైపు ఈ సంక్రాంతికి `బంగార్రాజు`తో థియేటర్‌లో సందడి చేసి హిట్‌ అందుకున్నారు నాగచైతన్య. ఇదిలా ఉంటే గతేడాది అక్టోబర్‌ 2న సమంతతో విడిపోతున్నట్టు ప్రకటించిన షాకిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఇద్దరం అనుకునే విడిపోయామని వెల్లడించారు చైతూ.